చివరకు ఏమి మిగిలింది "శూన్యం".
మనిషి జీవితంలో చివరికి మిగిలేది ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం ‘శూన్యం’. శూన్యం అంటే ఏమీ లేదని అర్ధం. మనిషి మరణానంతరం ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ తెలియదు. చివరకు మిగిలేది ఏమీ లేదని తెలిసినా, మనిషికి డబ్బు కోసం ఎందుకింత వెంపర్లాట? పోయేటప్పుడు తనతో ఎవరూ రారని తెలిసినా “నా వాళ్లు” అంటూ ఎందుకింత ఆరాటం? చితిమంటల కొలిమిలో తాను దహనమవుతున్నప్పుడు చుట్టూ ఏడుస్తున్న వారి రోదనలు కూడా వినిపించవని తెలిసిన మనిషికి ఎందుకింత గర్వం అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. మనిషి మరణానంతరం చివరికి మిగిలేది ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే కానీ ‘శూన్యం’ అని చెప్పడం మాత్రం సులభం. ఈ విషయం అర్థం కావాలంటే, ఫిజిక్స్ అరుణ్ కుమార్ రాసిన కవితా సంపుటి "శూన్యం" తప్పక చదవాల్సిందే.
ఫిజిక్స్ అరుణ్ కుమార్ రచించిన "శూన్యం" కవితా సంపుటిలో మొత్తం 58 కవితలు కొలువుదీరగా అందులోని ప్రతి కవిత సామాన్య పాఠకులకు అనురక్తి కలిగించే విధంగా వ్రాయబడ్డాయి. ప్రతి కవితను పరిశీలించగా, అందులో ఒక్కో కవితను ఆయన రాసిన తీరు, మృదుమధురమైన పదప్రయోగం వర్ణనాతీతం అనిపిస్తుంది ఫిజిక్స్ సబ్జెక్టులోని అనేక సాంకేతిక పదాలను కవితగా రాయడం ఒక అద్భుతం. "బ్లాక్ హోల్" అనే కవితలో " నీ చూపు వికిరణాలు
ఎన్నో వేల సార్లు
నా హృదయ మిర్రర్ పై
పడి పరావర్తనం చెందిన
పట్టుకోలేకపోయాను నేను..! అంటూ పాఠకులను మంత్రముగ్ధులను చేసే ఫిజిక్స్ పదాలతో కవితలు రాయడమంటే అది ఫిజిక్స్ అరుణ్ కుమార్ కు మాత్రమే సాధ్యం అనే భావన ఏర్పడుతుంది.
ఆయన వెలువరించిన "చరితకు నువ్వే ఓ ట్యాగ్ లైన్" కవిత ద్వారా నేటి యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. స్థాయీబేధం లేకుండా ఏ పోటీలో అయినా ‘గెలుపు’ మరియు ‘ఓటమి’ అనే రెండు పార్శ్వాలు ఉంటాయి. “గెలుపుతో పొంగి పోకు ఓటమితో కృంగిపోకు, రేపొకటుందని మరువకు” అనే నానుడిలా విజయం సాధించాలంటే అందుకు 'సాధన' ఎంతో అవసరం. లక్ష్యం చేరుకోవాలంటే నిరంతర తపస్సులా సాధన చేస్తే గానీ విజయం సాధించలేము. నిరంతర సాధన చేసిన వారికి మాత్రమే విజయం స్వాగతం పలుకుతుంది. సాధనకు పూనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, దిగలాగే ప్రయత్నాలు ఎదురవుతాయి. “ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం మీద స్పష్టత, ప్రయత్నంలో అకుంఠిత దీక్ష అనునిత్య సాధనే విజయానికి బాట వేస్తుందని, నీ గమ్యం చేరేవరకు ప్రయాణించు.. నువ్వే భవిష్యత్తు తరాలకు ఓ భానుడివి” అంటాడు రచయిత అరుణ్.
"నానమ్మ పెంచిన ప్రాణాలే" కవితను పరిశీలించగా, ప్రతి పాఠకుడు చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకునే విధంగా, తన బాల్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు.
"నా బాల్యపు స్మృతులను నా బ్రెయిన్ మెమోరీ కార్డులో వెతకగా అసూయ, కోపం, స్వార్థం లేని పసిప్రాయం ఎంత బాగుందో.." అంటాడు.. నిజానికి అరుణ్ చెప్పిన మాట అక్షర సత్యమే కదా!. కోపం, స్వార్ధం లేని చిన్ననాటి జ్ఞాపకాలతో మైమరిచిపోనివారు ఎవరుంటారు. పసిప్రాయంలో చేసిన చిలిపి పనులు గుర్తుచేసుకొని నవ్వుకోని వారు ఎవరుంటారు, ఎవరికైనా బాల్యం గొప్పదే. అంతేకాదు చంటి పిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తే “చందమామ రావే, జాబిల్లి రావే” అంటూ అమ్మ చందమామను చూపించగానే కడుపు నిండా భోజనం చేసినట్లు, చందమామ పాట ఎంతమధురమో! "ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ.. మా తాత చెప్పిన కథ కూడా అంత మధురంగా ఉందని అంటాడు అరుణ్.
"ప్రయివేటు టీచర్" కవితను పరిశీలించగా గురువు గొప్పతనం గురించి చాలామంది కవులు రాశారు కానీ గురువు ఆవేదనను అర్ధం చేసుకొనేలా, అందరినీ ఆకట్టుకునేలా కవిత్వం రూపంలో రాసిన ఏకైక కవి ఫిజిక్స్ అరుణ్ కుమార్ అనే చెప్పాలి. గురువు గొప్పతనం గురించి మేధావులంతా గురువంటే దేశ నిర్మాణానికి గుండెకాయ అని.. జాతీయ జెండా మతసామరస్యానికి ప్రాణం పోసే తరువే గురువని పొగుడుతున్నప్పుడు గురువు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అజ్ఞానంపై అక్షర సమరం చేస్తున్న గురువులను ప్రయివేటు టీచర్, ప్రభుత్వ టీచర్ అని రెండు పాయలుగా చీల్చడమే కాకుండా వారి జీతభత్యాలలో అత్యధిక వ్యత్యాసం ఉండటమనేది చాల బాధాకరమైన విషయాన్ని కవిత రూపంలో ఎంతో అద్భుతంగా పాఠకుడికి రసానందం కలిగే విధంగా మృదుమధురంగా "ప్రయివేటు టీచర్" కవితకు అక్షర రూపం కల్పించారు. అంతేకాకుండా కరోనా వైరస్ కాలంపై చేసిన సంతకపు దాడిలో ప్రయివేటు పంతులు బ్రతకడానికి బ్రతుకుపై గెలవడానికి కూరగాయలు అమ్ముతూ, రియల్ స్టేట్ ఎంప్లాయ్ గా ఇలా ఎన్నో పాత్రల చాటున ప్రయివేటు టీచర్ చాలీచాలని జీతంతో బతుకు పోరాటంలో పోరాడుతున్న తీరును ఎంతో చక్కగా వర్ణించారు. అయినా సరే విద్యార్థులకు మాత్రం ఆశయ పాఠాలు చెబుతూ మీరంతా కలాం గారిలా ఎదగండి అని వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని ప్రయివేటు టీచర్ కు జరుగుతున్న అన్యాయంపై కవిత్వంతో పోరాటం చేస్తున్న కవి అరుణ్ కుమార్. వీరి పోరాటం ఫలించి ప్రయివేటు టీచరులందరికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.
"అమ్మ జాతీయ జెండాను ముద్దాడింది" కవిత సంపుటిని పరిశీలించగా దేశ రక్షణ కొరకు సైనికుడిగా వెళ్తూ తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన కన్న కొడుకు కొన్నాళ్ల తరువాత ఓ మూటలో ఒక మాంసపు ముద్దై వస్తే వారి తల్లిదండ్రులు పడే ఆవేదన ని వర్ణించడం ఎవరికి సాధ్యపడదన్న విషయం మాత్రం నిజం. కానీ అరుణ్ రాసిన కవిత చదివితే తల్లి మనోవేదన పాఠకుడికి కొంతైనా అర్ధం అవుతుంది. తిరిగి వస్తానని చెప్పి తల్లికి ఇచ్చిన మాట తప్పడమే కాకుండా తండ్రి దున్నే పొలంలో మట్టై మిగిలాడన్న వేదనలో కూడా ఆ తల్లి నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించిన మరో భగత్ సింగ్ అంటూ రోదిస్తున్న ఆ తల్లి కళ్ళలో వెలుగునే చూస్తున్నారు జనం అంటాడు అరుణ్. దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ ను కడసారి చూసేందుకు వచ్చిన జనాన్ని, వారు చేసే నినాదాలను చూస్తూ యావత్ దేశం కన్నతల్లి కన్నీటి వేదన చూసి గుండె చెరువవుతుంది. మట్టై మిగిలిన వీరుడు, ఓ మొక్కై మొలిచి ధీరుడిగా ఆ మొక్క దేశం కోసం ఓ యోధుడిలా ప్రకాశించమని, ప్రాణాలివ్వమని చెబుతుంది. అది అర్థం చేసుకున్న కన్నతల్లి మరోసారి జాతీయ జెండాను ముద్దాడింది అని ఈ కవిత సారాంశం. దేశ భద్రత కోసం బలైన సైనికుడా నీ త్యాగం మరువలేనిది. ప్రతి పాఠకుడు ఈ కవిత చదివిన తర్వాత సెల్యూట్ చేయాల్సిందే. అంత అద్భుతంగా వర్ణించాడు అరుణ్.
ఫిజిక్స్ అరుణ్ కుమార్ రాసిన 58 కవితల్లో ప్రతి కవిత దేనికది ప్రత్యేకమే. ప్రతి కవితను పాఠకుడు చివరిదాకా చదివి ఆనందించడంతో పాటు మధురానుభూతి చెందుతాడు. ప్రతి కవితలో చమత్కారమైన పద విన్యాసంతో పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం అరుణ్ కుమార్ రచనా నైపుణ్యానికి కలికితు రాయిగా నిలుస్తాయి. సమాజాభివృద్ధికి ఉపయోగపడే మరిన్ని కవితలు అరుణ్ కుమార్ కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475