15, ఫిబ్రవరి 2026, ఆదివారం

నాన్న ఎప్పుడు హీరో నే

 హాస్టల్ దాటిన అడుగుల నుంచి

యూనివర్సిటీ దారి వరకు ఒక దృశ్యం

నా మనసును ఆపేసింది…


భుజం మీద లగేజీ,

ముందు నడిచే కూతురు, 

వెనుక నడుస్తూ జీవితమంతా మోస్తున్న నాన్న.


మాటలేమీ లేవు,

అయినా అర్థమయ్యే ప్రేమ,

చూపులేమీ లేవు,

అయినా కనిపించే త్యాగం.


ఆమె భవిష్యత్తు తేలికగా ఉండాలని

తన బరువంతా భుజాలపై వేసుకున్నాడు.


ఆ క్షణంలో

కళ్లలోకి నీళ్లు వచ్చాయి…

అర్థమైంది —

నాన్నలు ఎప్పుడూ

నిజమైన హీరోలేనని.

కామెంట్‌లు లేవు:

ఆమె జడలో ఒదిగిన మల్లెలు

ఆమె జడలో ఒదిగిన మల్లెలు  కురులకే అందం..  ఆ మల్లెలు సుగంధ పరిమళాలను వెదజల్లుతుంటే, అందరి చూపులు ఆమెవైపే మళ్ళినా… ఆ ఆకర్షణ మాత్రం ఆ మల్లెల మాధ...