ఆర్యభట్ట భారతదేశం అగ్రగామి గణిత శాస్త్రజ్ఞులు మరియు ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరు. సున్నాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడు.
శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో ఎటువంటి శాస్త్రీయ శిక్షణ పొందనప్పటికీ, అతను గణితశాస్త్రంలో గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంతమైన శ్రేణులు మరియు అనంతమైన భిన్నాలు వంటి అంశాలలో గణితానికి గణనీయమైన కృషి చేశారు. అప్పట్లో అపరిష్కృతంగా భావించిన సమస్యలకు పరిష్కారాలు కూడా కనుగొన్నారు.
శకుంతలా దేవి, భారతీయ మహిళా గణిత శాస్త్రజ్ఞురాలు, ఆమె అసాధారణమైన గణన యంత్రం కంటే వేగంగా అనేక సమస్యలను పరిష్కరించింది. 1980లో, రెండు యాదృచ్ఛిక 13-అంకెల సంఖ్యలను 28 సెకన్లలో గుణించడానికి దేవి చేసిన విజయవంతమైన ప్రయత్నం 1982 సంవత్సరానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అందుకే ఆమెకు 'హ్యూమన్ కంప్యూటర్' అనే బిరుదు వచ్చింది.
ప్రపంచంలో గణితంపై పట్టు సాధించిన దేశాల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 65వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2024 లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలవడం అందుకు నిదర్శనం. భారతదేశం నుండి హైస్కూల్ విద్యార్థులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం నాలుగు బంగారు పతకాలు మరియు ఒక రజత పథకం మరియు ఒక గౌరవప్రదమైన ప్రస్తావనతో దేశం గర్వించేలా చేసింది. అంతేకాకుండా, ఈ బృందం సాధించిన గొప్ప విజయం చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుంది మరియు గణితం ప్రాచుర్యం పొందడంలో సహాయపడుతుంది. 1989లో అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇది దేశ అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. ఇందులో భారత జట్టు జూలై 21న నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకంతో భారతదేశ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది.
65వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2024లో 108 దేశాలవారు పాల్గొనడం గొప్ప విషయం అందులో భారత్ కి 4వ స్థానం లభించడం మరో గొప్ప విషయం. ఈ పోటీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురు ఉన్నారు - మహారాష్ట్రకు చెందిన ఆదిత్య మాంగుడి వెంకట గణేష్, అస్సాంకు చెందిన ఆనంద భాదురి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కనవ్ తల్వార్, మహారాష్ట్రకు చెందిన రుషిల్ మాథుర్, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా మరియు మహారాష్ట్రకు చెందిన సిద్ధార్థ్ చోప్రా. ఈ బృందానికి ఐఐటీ బాంబే నుండి ప్రొఫెసర్ కృష్ణన్ శివ సుబ్రమణియన్ మరియు హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ నుండి డాక్టర్ రిజుల్ సైనీ నాయకత్వం వహించారు. డాక్టర్ సైనీ కూడా IMO లో మాజీ పతక విజేత కావడం గర్వించదగ్గ విషయం.
ఎంపిక ప్రక్రియ:
ప్రపంచ స్థాయిలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి విద్యార్థులు ఆరు దశల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటి దశలో విద్యార్థులకు మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్లో ప్రాథమిక గణిత ప్రశ్నలతో పరీక్షిస్తారు. రెండో దశను ప్రాంతీయ గణిత ఒలింపియాడ్ అంటారు, ఇక్కడ అభ్యర్థులు ఆరు ప్రశ్నలను పూర్తి చేయడానికి మూడు గంటల సమయం ఇస్తారు. ఆ తర్వాత మూడవ దశ ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ అంటారు. మూడవ రౌండ్లో దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఎంపిక చేయబడతారు మరియు గణితంలో ప్రతిభ కనబరిచిన వారిని మాత్రమే నాలుగో రౌండ్ కు ఎంపిక చేస్తారు. నాలుగో రౌండ్ నుంచి పరీక్ష కఠినంగా ఉంటుందని, అందుకోసం విద్యార్థులకు ఇంటెన్సివ్ శిక్షణ కోసం 10 రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి సరైన మెళకువలు నేర్పిస్తారు. ఆతర్వాత విద్యార్థులకు ఉపన్యాసాలు, పరీక్షలు మరియు సమస్య పరిష్కార సెషన్ల ద్వారా పరీక్షించబడతారు మరియు IMOలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి టాప్ 6 అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఆరుగురు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు IMO కోసం హాజరు కావడానికి ఉపన్యాసాలు, పరీక్షలు మరియు మాక్ పేపర్ల ద్వారా అధునాతన శిక్షణ ఇవ్వబడుతుంది.
IMO లో ఎలా పాల్గొనాలి:
విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా IMO రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పొందవచ్చు. రిజిస్ట్రేషన్ ఫారమ్‌లతో పాటు అన్ని SOF నమోదిత పాఠశాలలకు ప్రాస్పెక్టస్ పంపబడుతుంది. SOFతో నమోదు కాని పాఠశాలల కోసం, SOF అధికారిక వెబ్సైట్లో ఇ-మెయిల్ పంపడం ద్వారా ప్రాస్పెక్టస్‌ను అభ్యర్థించవచ్చు. స్కూల్ కోఆర్డినేటర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం స్కూల్ రిజిస్ట్రేషన్ ఫారమ్ (SRF) మరియు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ షీట్ (SRS) నింపాలి & ఫారమ్‌లను సమర్పించే గడువు తేదీకి ముందే SOF కార్యాలయానికి పంపాలి. SOF దరఖాస్తుదారు పాఠశాల మరియు విద్యార్థులను నమోదు చేసుకుంటారు. పాఠశాల నుండి విద్యార్థుల నమోదు జాబితా (SRS) ప్రకారం, SOF విద్యార్థులందరికీ రోల్ నంబర్లను కేటాయించడం జరుగుతుంది.
విజేతలు:
అర్జున్ గుప్తా అనే రజత పతక విజేత తన తండ్రి నుండి ఒలింపియాడ్ గురించి తెలుసుకుని వరుసగా మూడు సార్లు ఒలింపియాడ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అందులో IMO 2022 లో కాంస్య పతకం, IMO 2023 లో బంగారు పతకం మరియు IMO 2024 లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఒలింపియాడ్ ద్వారా నా దృక్పథాన్ని విభిన్న సంస్కృతులకు విస్తరించడానికి మరియు ప్రపంచ వైవిధ్యం పై నా అవగాహనను మెరుగుపరచుకోవడానికి. పరస్పర గౌరవం మరియు ప్రశంసలను పెంపొందించుకుంటూ మన భారతీయ సంస్కృతిని నా తోటివారితో పంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని మరియు ఈ అనుభవం నా గణిత నైపుణ్యాలను మెరుగుపరచడమే కాకుండా వ్యక్తిగా ఎదగడానికి కూడా సహాయపడిందని అతను తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నోయిడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి కనవ్ తల్వార్ 2-3 సంవత్సరాలుగా అంతర్జాతీయ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారు. మరోసారి తీవ్రంగా ప్రయత్నించి బంగారు పతకాన్ని సాధించాడు.
ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా 2018 మరియు 2019లో చెస్ ఛాంపియన్‌షిప్‌లో కూడా దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. CBSE హాజరు 75 శాతం కారణంగా అతను ఒలింపియాడ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విద్యార్థులు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయినా సరే పట్టుసడలని ప్రయత్నంతో వెండి పతకం సాధించాడు. దాంతోపాటు ఆనంద భాదురి మరియు రుషిల్ మాథుర్ స్వర్ణ పతకం సాధించారు.
దేశం గర్వించదగ్గ విషయం:
గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్, అతని అద్వితీయ మేధస్సు భారతదేశాన్ని ప్రపంచ గణిత శాస్త్రంలో ఉన్నత స్థాయికి చేర్చింది, ఎందరో కొత్త గణిత శాస్త్రజ్ఞులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. అందుకు దేశం గర్వించదగిన విషయం. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రతి పాఠశాలలో ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ వంటి పోటీలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే భవిష్యత్తులో మరిన్ని బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.
"ఎలా చదవాలో తెలియలిగాని ప్రతిఒక్కరు ఒక గ్రంథమే" అన్నట్లు ఎంతోమంది మేధావులున్న మన దేశంలో సరైన శిక్షణ లేక ఉన్నత శిఖరాలకు చేరుకోలేకపోతున్నారు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ 9391480475