నమ్మకం:
‘‘నిన్ను పొగిడే ప్రతి ఒక్కరినీ నీ స్నేహితుడిగా, దూషించే ప్రతి ఒక్కరినీ నీ శత్రువు గా భావించడం నీ కన్ను నువ్వే పొడుసుకున్నట్లు. పొగిడిన ప్రతివాడిని నమ్మి మోసపోవడం ఎంత తప్పో, తిట్టిన ప్రతివాడిని శత్రువు అనుకోవడం కూడా అంతే తప్పు అది స్నేహితులైనా, బంధువులైనా. నిజానిజాలు అందరికీ తెలుసు కానీ ఎవరికి ఏదైతే నాకేంటనే నిర్లక్ష్యం వల్లే తనకు తానే తవ్వుకుంటున్న గొయ్యి. మన చాపకిందకు నీరు వస్తే గాని చెమ్మను గుర్తుపట్టం అన్నట్లుగా ఏదైనా మన దాకా వస్తే గాని మనం మేల్కోలేము. అందుకేనేమో పడవ మునగకముందే ఒడ్డు చేరుకోవాలనే నానుడి పుట్టింది.
ఒక్కోసారి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఇన్ని సందేహాలతో మనుషులు బతుకుతున్న పరిస్థితులు చూస్తుంటే అసలు మనిషన్నవాడు ఉన్నాడా అనే సందేహం కలగక మానదు. నమ్మి మోసపోయినప్పుడు మనిషి పడే బాధ వర్ణనాతీతం. మరి మనిషి నమ్మకం లేకుండా ఎలా బతకగలడు? నమ్మకం అనివార్యం. నమ్మకం ప్రతిసారీ ఆనందాన్ని ఇస్తుంది. నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు, అది నిరాశ ను కలిగిస్తుంది. మరియు ఎవరిని నమ్మాలి మరియు ఎవరిని నమ్మకూడదు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు కానీ అనుభవించిన తర్వాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో విశ్వాసులు ఉన్నారు. నమ్మి చెడిపోయిన వారూ ఉన్నారు. నమ్మి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జమైకా పాప్ సింగర్ బాబ్ మార్లే ఒకరు. చిన్న వయసులోనే తన పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాటల యోధుడు. ఒకప్పుడు మైఖేల్ జాక్సన్ కు అభిమానులు ఎంతమంది ఉండేదో అంతకంటే ఎక్కువ అభిమానులను సంపాదించిన గొప్ప గాయకుడు. అలాంటి బాబ్ మార్లేకు బిల్ ఆక్స్లీ అనే అభిమాని పరిచయం అయ్యాడు. మార్లే అంటే వీరాభిమానం ఒక్కమాటలో చెప్పాలంటే పిచ్చి. పరిచయం ఏర్పడిన తర్వాత, మార్లేతో ఉండటానికి తన ఇంట్లోనే ఉంటానని చెప్పాడు. మార్లే తనపై చూపిన అభిమానాన్ని కాదనలేక చివరకు సరే అన్నాడు.
బాబ్ మార్లే మరియు బిల్ ఆక్స్లీ కొన్ని రోజుల్లోనే విడదీయరాని స్నేహితులు అయ్యారు. అనుకోకుండా ఓ రోజు మార్లీకి క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పారు. అది విన్న బాబ్ స్నేహితుడు
బిల్ తట్టుకోలేకపోయాడు. పలు ఆసుపత్రులను సందర్శించారు. పక్కనే ఉన్న బిల్ ఆక్స్లీ వేదనకు గురయ్యాడు. చిరుతిళ్లు, భోజనం మానేసి తన సేవలు చేస్తున్నాడు. కానీ క్యాన్సర్ మాత్రం తగ్గలేదు. సార్, బ్రిటన్ వెళ్దాం, అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారని నాకు తెలుసు, అన్నాడు. కానీ తగ్గలేదు. నా దేశం అమెరికా వెళ్ళాలి అన్నాడు. అయినా.. ప్రయోజనం లేకపోయింది. క్యాన్సర్ ముదిరిపోయింది. బాబ్ చావుబతుకుల్లో ఉన్నాడు.
అప్పుడు బాబ్ మార్లే బిల్ ఆక్స్లీని పిలిచాడు. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు, దండం పెట్టి కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు. ఇటు బిల్ కూడా ఏడ్చేశాడు. నా ఆరాధ్యుడు చనిపోతున్నాడని బోరుమన్నాడు. అలా.. బిల్ చేతుల్లోనే బాబ్ మార్లే ప్రాణాలు వదిలాడు.
ఇంతకీ.. బాబ్‌కి క్యాన్సర్ ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఒకరోజు షూస్ వేసుకుంటుండగా కుడికాలికి ఏదో సూది లాంటిది గుచ్చుకుంది. ఇది కనిపించనంత పరిమాణంలో ఉంది. అది క్యాన్సర్ కారక రసాయనాలతో పూత పూయబడింది. ఆ షూస్ ఎవరివి కావు.. బిల్ బహుమతిగా ఇచ్చాడు!
అంతకు ముందు, అతను బాబ్ మార్లే ఇంటిపై తుపాకులతో దాడి చేసి అతని భార్య మరియు కార్మికులను చంపిన ఒక సమూహానికి నాయకుడు. మార్లే బుల్లెట్ గాయంతో బతికి. కొంతకాలం తర్వాత అభిమానిగా పరిచయం ఏర్పరచుకొని బాబ్ ఇంట్లో చేరి మెల్లగా పని పూర్తి చేశాడు. బాబ్ పక్కనే ఉంటూ అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందకుండా చూసుకున్నాడు. మరి, అతను ఎవరు అనుకుంటున్నారు? అతను అమెరికాకు చెందిన C*I*A ఏజెంట్.
దీన్నిబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ! నమ్మకం తేనె పూసిన కత్తి లాంటిది. అందుకే తియ్యని మాటలెప్పుడు చేదు సంఘటనలకు దారితీస్తాయి. అలా అని ఎవ్వరిని నమ్మకుండా మనుగడ సాధించలేము. నమ్మకం లేకుండా ఏదైనా చేయడం అసాధ్యం. నమ్మకం రకరకాలుగా వివిధ కోణాలలో ఉంటుంది. ఎవరూ పూర్తిగా విశ్వాసం లేకుండా ఉండలేరు. అసలు విషయానికి వస్తే మనిషి నమ్మేవాటిని నమ్మటంలేదు నమ్మకూడనిది నమ్ముతున్నాడు. మనిషి అనునిత్యం అనుమానంతో బతుకుతున్నాడు.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి