వాహ్ ఉస్తాద్… జాకీర్ హుసేన్ :
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణవార్త ప్రపంచ సంగీత ప్రియులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యాలలో అత్యంత ప్రజాదరణ పొందిన తబలా పై కమనీయ ధ్వనులు పలికించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన గొప్ప కళాకారుడు.తబలా పై తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తాయి.
తబలా పై అతని చేతి మునివేళ్ళు అలల్లా ఓలలాడుతూ మధుర మృదంగాలై మోగుతుంటాయి.
అతని మనం ఎలా మర్చిపోగలం:
తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి జాకీర్ హుస్సేన్ పేరు చెప్పగానే తబలా విద్వాంసుడు గుర్తుకు రాకపోవచ్చు కానీ తాజ్ మహల్ టీ యాడ్ లో తబలా వాయించిన వ్యక్తి అంటే అందరికీ తెలుసు. నిన్న ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణ వార్త సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో, అతను ఎవరా అని చాలా మంది సందేహించారు. కాసేపటి తర్వాత జాకీర్ హుస్సేన్ మరణాన్ని తెలియజేస్తూ తాజ్ మహల్ టీ యాడ్ చూపించింది అప్పటివరకు ఆయన పేరు చాలా మందికి తెలియదు. చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు తన పేరుతో అందరికి పరిచయమవుతుంటారు. కానీ కొంతమంది మాత్రం తన పేరుతో కాకుండా తన ప్రతిభతో పరిచయమయ్యేవారు అతి కొద్దిమంది ఉంటారు అందులో జాకీర్ హుస్సేన్ ఒకరు. మొదటగా మన దేశంలో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీని 1966లో కోల్‌కతాలో నటీనటులు జీనత్ అమన్ మరియు మాళవిక తివారీ తాజ్ మహల్ టీ యాడ్ తో ప్రారంభించారు కానీ తయారీదారులు ఆశించినంత ప్రజాధారణ పొందలేకపోయిందని గమనించారు. ఆతర్వాత హిందుస్థాన్ థాంప్సన్ అసోసియేట్స్ (HTA) ఒక కొత్త బ్రాండ్ ఇమేజ్‌ని రూపొందించడానికి భారతీయతను పాశ్చాత్య ఎక్స్‌పోజర్‌తో సమతుల్యం చేసే బ్రాండ్ అంబాసిడర్ అవసరం వచ్చింది. తబలా అభిమాని అయినా (HTA) కాపీ రైటర్ KS చక్రవర్తి జాకీర్ హుస్సేన్ పేరు ఎంపిక చేశారు. ఎంపిక సమయానికి హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉండటంతో KS చక్రవర్తి అతన్ని సంప్రదించి తాజ్ మహల్ టీ యాడ్ మీరే చేయాలనీ పట్టుపట్టడంతో అందుకు హుస్సేన్ విముఖత చూపలేక సరే అని తాజ్ మహల్ టీ దేశ నలుమూలల వ్యాప్తిచెందాలనే సంకల్పంతో యాడ్ కొరకు తన సొంత ఖర్చుతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ కి వచ్చారు. ప్రకటన యొక్క స్క్రిప్ట్ కొరకు గంటల తరబడి సాధన అనంతరం విజయవంతంగా పూర్తి చేశారు. దీన్నిబట్టి దేశంపై జాకిర్ హుసేన్ ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్
నాలుగు గ్రామీ అవార్డు లతో పాటు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డు, USA నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ మరియు ఫ్రాన్స్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌లో అధికారితో సహా లెక్కలేనన్ని అవార్డులు మరియు గౌరవాలు అందుకున్నారు.
2024 లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ చరిత్ర సృష్టించారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో, మన దేశంతోపాటు ఎంతోమంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది.
ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం:
మన నిత్యజీవితంలో ఒక చిన్న అవార్డు వస్తే ఉప్పొంగి పోయే వాళ్ళని చూస్తుంటాము. కానీ కొంతమంది ఎన్ని అవార్డులు సంపాదించినా నేనే గొప్ప అనే భావన ప్రస్తావించరు అలాంటి వారిలో జాకిర్ హుస్సేన్ ఒకరు. "ఎన్ని అవార్డులు వచ్చినా, ఎప్పుడూ నేర్చుకోగలగడం ఎంతో ముఖ్యం అని చెపుతుంటారు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన ఒకేఒక మాట "మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని" తండ్రి చెప్పిన మాటే ఇప్పటివరకు ఈస్థాయిని చేర్చగలిగిందని పలు ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు.
అసలు సిసలు హిందుస్తానీ రాగాల ఉస్తాద్ హుస్సేన్ ఇక లేడన్న విషయం సంగీత ప్రియులందరికీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ తన మధురమైన ధ్వనులు శ్రోతల మదిని మృదు మధుర రాగాలతో మురిపిస్తూనే ఉంటాయి.
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి