26, ఏప్రిల్ 2022, మంగళవారం

ఆరోగ్య సంపద

 ఆరోగ్య సంపద
= = = = = = = = =
అసలైన సంపద అంటే ఆరోగ్యంగా ఉండడమే అంటారు. ప్రశాంత చిత్తం కలిగిన వారు సుఖ నిద్ర పొందుతారు. అంతకన్నా ఆస్తి ఏమి ఉంటుంది?. మనం ఆరోగ్యాన్ని సంపాదించకుండా, ఆస్తులని సంపాదిస్తున్నాం, అనారోగ్యపాలవుతున్నాం  
ప్రతిఒక్క మానవుడు ఆరోగ్యముగా ఉండాలి కోరుకుంటారు కానీ ఏ ఒక్కరు కూడా ఆరోగ్యముగా ఉండడానికి కావలిసిన నియమాలను పాటించారు ఎవరైతే పాటిస్తారో వారే ఆరోగ్యముగా ఉంటారు అది చాల తక్కువ అనే చెప్పొచ్చు ...
ఆరోజుల్లో ఏ టెక్నాలజీ లేకున్నా మంచి ఆహారం తీసుకొని 90 ఏళ్ళు పైగా బతికినవాళ్లు 80% మంది.
ఇప్పటివాళ్ళకి టెక్నాలజీ ఎక్కువై మంచి ఆహారం కొరత ఎక్కువైంది దానివలన 90 ఏళ్ళు బతికేవాళ్ళము ఎప్పుడు పోతామో అయోమయంలో ఉంది జీవితం. దీనికి కారణం మనమే...
ఎలా అంటే ....
1. ఆరోజుల్లో పొద్దున్న లేవగానే పళ్ళు తోమడానికి వేప పుల్ల వేసుకునేది. పళ్ళ రోగాలు లేవు..
మనం లేవగానే కెమికల్తోతయారైన పేస్ట్ ని వాడుతున్నాం.  చిన్నతనం నుండే పంటి నొప్పులు వాటికీ చికిత్సలు.
2. అప్పటివాళ్ళు  టీ తయారీకి స్వచ్ఛమైన గేదె పాలను వాడేవారు. మనం కెమికల్తో తయారైన పాలను వాడుతున్నాం..
3. ఆరోజుల్లో టిఫిన్ చేయటం చాల తక్కువ మూడు పూటలు అన్నం తినేవాళ్లు. స్వయంగా పండించిన ధాన్యంతో మరియు కూరగాయలతో స్వచ్ఛమైన నూనెతో వంట వండుకొని తినేవాళ్లు.
మనం తినే టిఫిన్ మరియు అన్నం అన్ని కూడా కెమికల్ ఉపయోగించి పండించినవే అంతేకాదు వంటనూనెలు కూడా దేనితో తయారుచేస్తున్నారో తెలియని ప్రశ్నగా మారింది..
4. ఆరోజుల్లో వ్యాయామం చేసేవాళ్ళేకాదు అయినా ఆరోగ్యాంగా ఉండే వాళ్ళు .. ఇప్పుడు వ్యాయామం చేసేవాళ్ళు తక్కువే ఆరోగ్యాంగా ఉండేవాళ్ళు కూడా తక్కువే. కారణం మనం సుఖమైనా జీతానికి అలవాటు పడటం, నాణ్యమైన ఆహారం దొరకకపోవడం. ఇవన్నీ తెలియాక మనం అనారోగ్యాంగా ఉన్నపుడు డాక్టర్ దగ్గరకి వెళ్లి అయన రాసిన మెడిసిన్స్  సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతాం అది మన తెలివి ..
a. మనం పదిసార్ల వాడిన నూనెలో వేయించిన అప్పడాలు, వడలు, సమోసాలు వదలకుండా తింటాం అయినా ఏమి కాదు అనుకుంటాం...
b. రోడ్డుపక్కన చెత్త నీటితో తయారైన పానీపూరి లొట్టలేసుకుని తింటాం అయినా ఏమి కాదు అనుకుంటాం ..
c. అన్నిరకాల మందు తాగుతాం అందులో ఏమి కలిసిన మనకు ఏమి కాదు అనుకుంటాం..
మనలని రక్షించే డాక్టర్ దగ్గరకి వెళ్లి ఆయన్నే పరీక్షితం...
అయినా డాక్టర్ చెప్పినట్లు వినం అయినా ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చుపెడతాం. కోట్లు ఇచ్చిన మన అనారోగ్యాన్ని ఎదుటివారు తీసుకోరు అని తెలిసిన ఆరోగ్య సంపదను మరిచి ధన సంపదే కావాలనుకుంటాం..
ఆరోగ్యమే మహాభాగ్యం అని పలకటం సులభమే కానీ దాన్ని ఆచరణలో పెట్టాం.. దాన్ని అర్ధం చేసుకొనే లోపే మన జీవితం అయిపోతుంది..
భగవంతుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదంలో ఏముందోఏమోగాని అది అర్ధం కాదు..


మీ
కోట దామోదర్
మొబైల్ : 9391480475
 
 

  



కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...