21, జనవరి 2026, బుధవారం

హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

 హృదయాలను కదిలించిన చిన్నారి

సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా: సాహసం, సాధన, స్ఫూర్తి

 సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా: సాహసం, సాధన, స్ఫూర్తి


భారత గణతంత్ర దినోత్సవ కవాతు కేవలం ఆయుధాల శక్తిని ప్రదర్శించే వేడుక కాదు; అది రాజ్యాంగంపై నమ్మకానికి, సమానత్వానికి, దేశ సేవకు అంకితభావానికి ప్రతిరూపం. 2026 జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై ఆ విలువలకు సజీవ రూపం దాల్చబోతోంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా, చరిత్రలో తొలిసారిగా, పురుష సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ దళానికి నాయకత్వం వహిస్తూ, భారత సాయుధ దళాల్లో మహిళల సాధికారతకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు.


140 మందికి పైగా పురుష సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ దళానికి, అది కూడా గణతంత్ర దినోత్సవ కవాతులో, ఒక మహిళా అధికారి నాయకత్వం వహించడం భారత భద్రతా దళాల చరిత్రలో ఒక అపూర్వ మైలురాయి. ఇది సిమ్రాన్ బాలా వ్యక్తిగత విజయంగా మాత్రమే పరిమితం కాకుండా, భారత సాయుధ దళాల్లో మహిళల పాత్ర గుణాత్మకంగా మారుతున్న తీరుకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.


జమ్మూ కాశ్మీర్ నుంచి కర్తవ్య పథ్ వరకు


రాజౌరి జిల్లా వంటి సవాళ్లతో కూడిన ప్రాంతం నుంచి ఎదిగిన సిమ్రాన్ బాలా ప్రయాణం ధైర్యం, పట్టుదల, స్వప్నాల ఫలితం. జమ్మూలోని గాంధీనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో విద్యనభ్యసించిన ఆమె, అనేక అడ్డంకులను అధిగమిస్తూ కఠినమైన యూపీఎస్సీ సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షను జయించి, దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళమైన సీఆర్పీఎఫ్‌లో అధికారిణిగా అడుగుపెట్టి, వేలాది యువతులకు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు.


2025 ఏప్రిల్‌లో సిమ్రాన్ బాలాకు తొలి నియామకం ఛత్తీస్‌గఢ్‌లోని ‘బస్తారియా’ బెటాలియన్‌లో లభించింది — నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రబిందువైన, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో. అయితే ఆ సవాలే ఆమెను మరింత దృఢంగా మలిచింది. శిక్షణ దశ నుంచే ఆమె ప్రతిభ స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌లోని సీఆర్పీఎఫ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ట్రైనింగ్ మరియు పబ్లిక్ స్పీకింగ్‌లో ఉత్తమ అధికారిణిగా అవార్డులు అందుకుని, తాను కేవలం బాధ్యతలు నిర్వహించడమే కాకుండా నాయకత్వానికి సిద్ధంగా ఉన్నానని నిరూపించారు.


మారుతున్న సైనిక సంస్కృతి


3.25 లక్షల మంది సిబ్బందితో కూడిన సీఆర్పీఎఫ్ వంటి విస్తారమైన భద్రతా దళంలో మహిళలు నాయకత్వ స్థానాల్లోకి ప్రవేశించడం కేవలం ప్రతిభ ఆధారిత ఎంపిక ఫలితం మాత్రమే కాదు; అది భద్రతా వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులకు సూచిక. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక విధులు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు వ్యతిరేక చర్యలు వంటి రంగాలు సంప్రదాయంగా “పురుషాధిక్య” పరిధులుగా భావించబడ్డాయి. అయితే మహిళలు ఈ రంగాల్లో బాధ్యతలు స్వీకరించి, నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా, సామర్థ్యం లింగంపై ఆధారపడదనే సత్యాన్ని వ్యవస్థాపితంగా నిరూపిస్తున్నారు. ఈ మార్పు భారత భద్రతా దళాల్లో సమానత్వం భావనను భావోద్వేగ నినాదం నుంచి కార్యాచరణాత్మక వాస్తవంగా మార్చుతున్న కీలక దశగా విశ్లేషించవచ్చు.


గణతంత్ర దినోత్సవం 2026: శక్తి, వైవిధ్యం, సమానత్వం


2026లో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం సంప్రదాయ ప్రదర్శనగా మిగలడం కాదు; ఇది భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సమానత్వం సమీకరించిన ఒక శక్తివంతమైన చిత్రంగా మారబోతోంది. 150 సంవత్సరాల జాతీయ గీతం నేపథ్యంతో, కర్తవ్య పథ్‌లో ప్రదర్శించబోయే వేడుకలు దేశ భద్రతా వ్యవస్థలో మహిళల ప్రాధాన్యం, సాంస్కృతిక సమగ్రతను స్పష్టం చేస్తాయి.


సీఆర్పీఎఫ్–ఎస్‌ఎస్‌బీ మహిళా ‘డేర్ డెవిల్స్’ బృందం, బుల్లెట్ బైక్ స్టంట్లు, సీఐఎస్‌ఎఫ్ మరియు బీఎస్‌ఎఫ్ బ్యాండ్‌లు, ఒంటె-మౌంటెడ్ దళాలు — ఇవన్నీ ఒక వైవిధ్య భరిత భద్రతా వ్యవస్థ యొక్క ప్రతిబింబంగా నిలుస్తాయి. అంతేకాక, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరవడం, ఈ వేడుకలకు అంతర్జాతీయ గుర్తింపును కూడా జోడిస్తుంది.


ఈ వేడుక కేవలం భారతదేశం యొక్క సైనిక శక్తిని మాత్రమే కాక, సమానత్వం, సాంస్కృతిక సమ్మేళనం, మరియు విశ్వస్థాయిలో ప్రతిష్టను చూపే ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నిలుస్తుంది.


ఒక అధికారి కాదు – ఒక సందేశం


సిమ్రాన్ బాలా కర్తవ్య పథ్‌పై అడుగులు వేస్తున్నప్పుడు, ఆమె వెనుక నిలిచేది కేవలం సీఆర్పీఎఫ్ దళం మాత్రమే కాదు. లక్షలాది యువతులు, ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిల కలలు కూడా ఆమెతో పాటు నడుస్తాయి.


ఈ కవాతు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది.

భారతదేశంలో ధైర్యానికి లింగం లేదు. నాయకత్వానికి పరిమితులు లేవు.


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 




3, జనవరి 2026, శనివారం

చిన్న పెన్సిల్.. పెద్ద కథ!

 


ఈనాడు

epaper.eenadu.net (Date: 03.01.26)

చిన్న పెన్సిల్.. పెద్ద కథ!

రాహుల్, బిట్టు ఇద్దరూ అన్నాదమ్ముళ్లు ఒకసారి వాళ్ల తాతయ్య దగ్గరికి వెళ్లి.. 'చూడు తాతయ్యా తమ్ముడు... రోజూ తన పెన్సిల్ పారేసుకుని నాది తీసుకుంటాడు. అమ్మేమో నేను పారేస్తున్నాను అనుకుంటోంది' అన్నాడు రాహుల్. 'అది సరేగానీ నీకు పెన్సిల్ గురించి తెలుసా?' అడిగారు తాతయ్య. 'తెలీదు.. ఏంటో చెప్పండి తాతయ్యా!' అన్నాడు రాహుల్. 'మీలాంటి పిల్లల నుంచి పెద్ద పెద్ద ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, శాస్త్రవేత్తలు, చిత్రకారుల వరకూ ఎంతోమంది పెన్సిల్ వాడతారు. మనదేశంలో పెన్సిల్ తయారీ సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ వందకు పైగా దేశాల నుంచి మనం పెన్సిళ్లను, వాటికి అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే తయారైన పెన్సిళ్లను పలు దేశాలకు ఎగుమతులూ చేస్తున్నాం. పెన్సిళ్ల ఎగుమతుల్లో చైనా తరవాత

స్థానం మనదే. పెన్సిల్ తయారీకి గ్రాఫైట్, చెక్క మట్టి, పెయింట్, రబ్బర్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. పెన్సిల్లో నల్లగా కనిపించే భాగం గ్రాఫైట్. దాన్ని క్లేతో కలిపి పేస్ట్గా తయారు చేసి, సన్నని పుల్లలుగా మార్చి, అధిక ఉష్ణోగ్రత దగ్గర కాలుస్తారు. క్లే ఎక్కువైతే పెన్సిల్ 'హార్డ్ (హెచ్)' అవుతుంది. క్లే తక్కువైతే పెన్సిల్ 'డార్క్(బి)'

అవుతుంది. రెండూ కలిసి మధ్యస్థంగా ఉండేదాన్ని 'హెచ్బీ' అంటారు. ఇంకా 'ఫర్మ్ (ఎఫ్)' అని ఇంకో రకం కూడా ఉంది. వీటిలోనూ మళ్లీ గ్రేడులుంటాయి. వాటిని డ్రాయింగ్ వేసేవాళ్లు వాడతారు. గ్రాఫైట్ భారత్, చైనా, శ్రీలంకలో లభిస్తుంది. మన దేశంలో ఇది ప్రధానంగా ఝార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొరుకుతుంది. గ్రాఫైట్ చుట్టూ ఉండే చెక్కయ్!

కోసం సాధారణంగా దేవదారు చెట్టు కలపను వాడతారు. ఇది అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా అడవుల్లో లభిస్తుంది' అని చెప్పారు తాతయ్య. 'ఒక పెన్సిల్ తయారవడానికి ఇన్ని పనులు జరగాలన్నమాట' అన్నాడు రాహుల్. అవునంటూ మనవణ్ని దగ్గరికి తీసుకున్నారు తాతయ్య.

కోట దామోదర్




హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్ "వరుణవి"

  హృదయాలను కదిలించిన చిన్నారి సరిగమప లిటిల్ ఛాంప్స్  "వరుణవి" ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేరు అనే మాట నిజమని చక్కగా సాక్ష్య...