ఈనాడు
epaper.eenadu.net (Date: 03.01.26)
చిన్న పెన్సిల్.. పెద్ద కథ!
రాహుల్, బిట్టు ఇద్దరూ అన్నాదమ్ముళ్లు ఒకసారి వాళ్ల తాతయ్య దగ్గరికి వెళ్లి.. 'చూడు తాతయ్యా తమ్ముడు... రోజూ తన పెన్సిల్ పారేసుకుని నాది తీసుకుంటాడు. అమ్మేమో నేను పారేస్తున్నాను అనుకుంటోంది' అన్నాడు రాహుల్. 'అది సరేగానీ నీకు పెన్సిల్ గురించి తెలుసా?' అడిగారు తాతయ్య. 'తెలీదు.. ఏంటో చెప్పండి తాతయ్యా!' అన్నాడు రాహుల్. 'మీలాంటి పిల్లల నుంచి పెద్ద పెద్ద ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, శాస్త్రవేత్తలు, చిత్రకారుల వరకూ ఎంతోమంది పెన్సిల్ వాడతారు. మనదేశంలో పెన్సిల్ తయారీ సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ వందకు పైగా దేశాల నుంచి మనం పెన్సిళ్లను, వాటికి అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే తయారైన పెన్సిళ్లను పలు దేశాలకు ఎగుమతులూ చేస్తున్నాం. పెన్సిళ్ల ఎగుమతుల్లో చైనా తరవాత
స్థానం మనదే. పెన్సిల్ తయారీకి గ్రాఫైట్, చెక్క మట్టి, పెయింట్, రబ్బర్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. పెన్సిల్లో నల్లగా కనిపించే భాగం గ్రాఫైట్. దాన్ని క్లేతో కలిపి పేస్ట్గా తయారు చేసి, సన్నని పుల్లలుగా మార్చి, అధిక ఉష్ణోగ్రత దగ్గర కాలుస్తారు. క్లే ఎక్కువైతే పెన్సిల్ 'హార్డ్ (హెచ్)' అవుతుంది. క్లే తక్కువైతే పెన్సిల్ 'డార్క్(బి)'
అవుతుంది. రెండూ కలిసి మధ్యస్థంగా ఉండేదాన్ని 'హెచ్బీ' అంటారు. ఇంకా 'ఫర్మ్ (ఎఫ్)' అని ఇంకో రకం కూడా ఉంది. వీటిలోనూ మళ్లీ గ్రేడులుంటాయి. వాటిని డ్రాయింగ్ వేసేవాళ్లు వాడతారు. గ్రాఫైట్ భారత్, చైనా, శ్రీలంకలో లభిస్తుంది. మన దేశంలో ఇది ప్రధానంగా ఝార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొరుకుతుంది. గ్రాఫైట్ చుట్టూ ఉండే చెక్కయ్!
కోసం సాధారణంగా దేవదారు చెట్టు కలపను వాడతారు. ఇది అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా అడవుల్లో లభిస్తుంది' అని చెప్పారు తాతయ్య. 'ఒక పెన్సిల్ తయారవడానికి ఇన్ని పనులు జరగాలన్నమాట' అన్నాడు రాహుల్. అవునంటూ మనవణ్ని దగ్గరికి తీసుకున్నారు తాతయ్య.
కోట దామోదర్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి