21, ఏప్రిల్ 2024, ఆదివారం

అలుపెరగని ఆటగాడు "ప్రవీణ్ తాంబే".

 అలుపెరగని ఆటగాడు "ప్రవీణ్ తాంబే".

విజయం సాధించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ వారిలో కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యం వైపు వెళ్లి అనుకున్న విజయాన్ని సాధిస్తారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోలేక కొందరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. లక్ష్యం సాధించాలంటే లక్ష సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొనే శక్తి మీలో ఉన్నప్పుడు విజయం మీ సొంతమవుతుంది. అనుకూల వాతావరణం లేకపోవడం మరియు ప్రతికూల పరిస్థితులు లక్ష్యాల సాధనకు ప్రాథమిక అవరోధాలు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం.

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించిన విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ప్రవీణ్ తాంబే ఆ కోవకు చెందిన వారే.

41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసి, అసాధ్యాలను సుసాధ్యం చేసి లేటు వయసులో అరుదైన ఘనతను సాధించి సంచలనం సృష్టించాడు. సాధారణంగా క్రికెటర్లు 40 ఏళ్లు నిండకుండానే రిటైర్ అవుతారు. కానీ ప్రవీణ్ తాంబే రిటైర్మెంట్ వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించి తన ప్రతిభతో క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీల్) లోకి ఎలా రాగలిగారనేది ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలగక మానదు.  

ప్రవీణ్ తాంబే ఓ మధ్యతరగతి కుటుంబంలో విజయ్ తాంబే, జ్యోతి తాంబే దంపతులకు 8 అక్టోబర్ 1971 న ముంబైలో జన్మించారు. తండ్రి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. ప్రవీణ్ తాంబే చిన్నప్పటినుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో స్నేహితులందరూ చదువుపై శ్రద్ధ చూపేవారు, కానీ తను మాత్రం క్రికెట్ పైనే ఆసక్తి చూపేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అతనికి క్రికెట్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకుని ఫాస్ట్ బౌలర్‌గా ఎదగాలనుకున్నాడు. కానీ అతని ఓరియంట్ షిప్పింగ్ కెప్టెన్ అజయ్ కదమ్ అతన్ని లెగ్ స్పిన్ ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అతడికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి తగు ప్రోత్సాహాన్ని అందించారు తప్ప ఏ ఒక్క రోజు క్రికెట్ మానేయమని చెప్పలేదు. ఎందుకంటే తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి. కానీ ప్రవీణ్ తాంబే తల్లికి క్రికెట్ ఆడటం ఇష్టం ఉండదు. క్రికెట్ ఆడటం మానేసి చదువుపై దృష్టి పెట్టాలని తల్లి ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రవీణ్ తాంబేలో మార్పు రాలేదు. అన్నదమ్ములిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ప్రవీణ్ అన్నయ్య ప్రశాంత్ చదువుపై శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధిస్తుండగా, క్రికెట్ అంటే ప్రాణం అన్నట్లుగా ప్రవీణ్ తాంబే చదువుపై ఆసక్తి చూపేవాడు కాదు . ప్రవీణ్ తాంబే ఎప్పుడు తనతో కలిసి క్రికెట్ ఆడేవాడు. 10వ తరగతి తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో చదివారు. ఆ తర్వాత అన్నయ్య ప్రశాంత్ మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి సాయపడేవాడు, అయితే ప్రవీణ్ తాంబే క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాడు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతనికి సరైన కోచింగ్ లభించలేదు. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని జాబ్ చేయడం ప్రారంభించాడు. అయినా క్రికెట్ ఆటపై అతని ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. అనుకున్న ఆశయాన్ని అధిగమించాలంటే తపన పెరిగింది. ఉద్యోగం చేస్తూనే రాత్రిపూట ప్రాక్టీస్ చేసేవాడు. కొడుకు క్రికెట్ పిచ్చిని అరికట్టేందుకు తల్లి జ్యోతి తాంబే ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా మారతారు అనే ఉద్దేశంతో పెళ్లి చేశారు. అయినప్పటికీ, ఏమీ మారలేదు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆడలేదు. ఆటే ప్రాణంగా, క్రికెట్ తన జీవితంలో భావించి తన 41 సంవత్సరాల వయస్సులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసి అత్యంత వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. వయస్సును లెక్కచేయని మేరునగధీరుడు. ప్రపంచం మెచ్చిన ఆటగాడు ప్రవీణ్ తాంబే.

ప్రారంభ వృత్తి:

జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఎన్ని అడ్డంకులనైనా అధిగమించి తీరాల్సిందే అప్పుడే విజయం సాధించడానికి అవకాశం ఉందనడానికి ఉదాహరణే ప్రవీణ్ తాంబే జీవితం. అతను 1995-96లో ముంబై దేశీయ లీగ్‌లోని డి పార్సీ సైక్లిస్ట్‌ల జట్టుతో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2000 మరియు 2002 సంవత్సరాల మధ్య ముంబై రంజీ ప్రాబబుల్స్ జట్టులో మంచి పేరు సంపాదించారు. కానీ దురదృష్టవశాత్తు తుది జట్టులో డ్రాఫ్ట్ చేయలేకపోయింది. అయినా ఎప్పుడు కుంగిపోలేదు. లక్ష్యం ముందు ఎన్ని అవరోధాలు కనపడదు అన్నట్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం లక్ష్యంగా ముందుకు సాగారు. పగలు ఉద్యోగం రాత్రి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు అహర్నిశలు శ్రమించారు. ఆతర్వాత IPL ప్రారంభ సమయంలో నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా ప్రవీణ్ తాంబే లైజన్ ఆఫీసర్‌గా పనిచేశాడు. జనవరి 2013లో జరిగిన ఆహ్వానం T20లో DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ యొక్క B జట్టుకు తాంబే కోచ్‌గా ఉందని తెలుసుకుని ప్రవీణ్ తాంబే ను బౌలర్‌గా అవకాశం పొందారు. టోర్నమెంట్‌లో గాయపడిన రాహుల్ శర్మ మరియు తాంబే 12 వికెట్లు పడగొట్టి అతని జట్టు ఆహ్వానం టోర్నమెంట్‌లో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారు. తన ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది మరియు రాజస్థాన్ రాయల్స్‌తో IPL ఆడటానికి దోహదపడింది. ఐపీఎల్‌లో ఎంపికయ్యే ముందు, తాంబే ఫస్ట్-క్లాస్ జట్టు కోసం ఉన్నత స్థాయి ఆట కూడా ఆడకపోవడం గమనార్షం. అతను 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరపున తన ప్రొఫెషనల్ క్రికెట్ అరంగేట్రంతో పాటు 41 సంవత్సరాల వయస్సులో తన T20 అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తర్వాత జరిగిన ఛాంపియన్స్ లీగ్ T20లో లెగ్ స్పిన్నర్ గా స్పాట్‌లైట్‌ని పొందాడు, అతను ఐదు గేమ్‌లలో 6.50 సగటుతో 12 వికెట్లతో పోటీలో ప్రముఖ వికెట్-టేకర్‌గా ఉన్నాడు, నరైన్ మరియు ఆర్ అశ్విన్. ఆ సంవత్సరం అతని ప్రదర్శనలు అతనికి 2013-14 రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు తన తొలి పిలుపునిచ్చాయి. ఇంకా 2014 IPL లో తాంబేక్తా నైట్ రైడర్స్‌పై 5 మే 2014న అహ్మదాబాద్‌లో మనీష్ పాండే , యూసుఫ్ పఠాన్ మరియు ర్యాన్ టెన్ డోస్చాట్‌లను అవుట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించాడు. 2018 T10 లీగ్‌లో కేరళ నైట్స్‌తో జరిగిన నాల్గవ గ్రూప్ మ్యాచ్‌లో అతను క్రిస్ గేల్ , ఇయాన్ మోర్గాన్ , కీరన్ పొలార్డ్ , ఫాబియన్‌లను అవుట్ చేయడం ద్వారా T10 చరిత్రలో 5 వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలెన్ మరియు ఉపుల్ తరంగ, మోర్గాన్, పొలార్డ్ మరియు అలెన్‌లను వరుస బంతుల్లో అవుట్ చేయడం ద్వారా T10 లీగ్‌లో షాహిద్ ఆఫ్రిది తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రవీణ్ తాంబే తన IPL కెరీర్‌లో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20లో తాంబే గోల్డెన్ వికెట్ అవార్డు అందుకున్నాడు. అనుకున్న ఆశయం కోసం ఎన్నో అవరోధాల అవకాశాలుగా మలుచుకుని ప్రపంచంలోనే అత్యంత వయస్కుడిగా చరిత్ర సృష్టించి 2020లో, 48 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యాడు.

"కౌన్ ప్రవీణ్ తాంబే చిత్రం" స్ఫూర్తితో:

"మీ కలలు సాకారం కావాలంటే ముందుగా కలలు కనాలి" అబ్దుల్ కలాం మాటలను ప్రవీణ్ తాంబే ప్రపంచానికి పోరాట స్ఫూర్తితో తెలియజేశారు. ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా 2022లో జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం "కౌన్ ప్రవీణ్ తాంబే". ఉత్తమ క్రీడా చిత్రాల్లో ఒకటి. వయస్సు అనేది ఒక అంకె అని లక్ష్యం చేరుకోవాలంటే వయసుతో పనిలేదని, ప్రవీణ్ తాంబే నిజ జీవితంలో అవరోధాలు, అవమానాలను ఎదుర్కొని లక్ష్యం సాధించిన తీరును ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. 


వ్యాసకర్త 

కోట దామోదర్ 

మొబైల్: 9391480475 









 


కామెంట్‌లు లేవు:

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్".

ది కింగ్ ఆఫ్ బాక్సింగ్ "మైక్ టైసన్" అతను ప్రపంచ బాక్సింగ్ క్రీడారంగంలోనే అతి బలవంతుడు, సింహబలుడు. సింహం అడవికి రాజైనట్లు, ఆయన ప్రప...