15, ఫిబ్రవరి 2026, ఆదివారం

మనిషి మరణం:

 మనిషి మరణం:


పల్లకి ఎక్కని మనిషి ఉంటాడో లేదో తెలియదుగానీ…
పాడె ఎక్కని మనిషి మాత్రం ఉండడు.

జననం నుంచే జీవితం
మరణం వైపు నడిచే యాత్ర—
వీధులంతా ఆశలతో నిండినా
చివరికి చేరేది
మౌనపు మృత్యువు ఒడిలోనే.

రాజ్యాలేలిన రాజైనా,
కష్టాల మట్టిలో పుట్టిన పేదైనా
శ్వాస విడిచే వేళ
అందరికీ ఒకటే దారి, ఒకటే పాడె.

పల్లకీల గర్వం క్షణికం,
పాడే నిజం శాశ్వతం
ప్రతి జీవికి మరణం సహజం,
అది తప్పించుకోలేని
జీవితానికి చివరి చరణం మనిషి మరణం.

✍️ కవి, రచయిత
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది

అల ఒడ్డున ఒదిగినట్లు... కల కాలంలో కలిసిపోతుంది మనిషి కలలు అలల్లా ఎగసిపడతుంటాయి… ఆశల ఆకాశాన్ని తాకాలని ఆరాటపడతుంటాయి… కానీ… అల ఎంత ఉప్పొంగినా...