30, ఏప్రిల్ 2026, గురువారం

complete vs finish

 ఒక సాయంత్రం ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు భార్యకు ఒక్కసారిగా ఒక సందేహం వచ్చింది. భర్త దగ్గరకు వచ్చి అడిగింది.


“ఏవండీ … ఒక విషయం అడగాలా?”

భర్త నవ్వుతూ, “అడుగు, ఏమైంది?” అన్నాడు.

“Complete కి, Finish కి తేడా ఏముంది? రెండూ ఒకటే మీనింగ్ కదా!” అని అమాయకంగా అడిగింది.

భర్త కాసేపు ఆమె ముఖం చూసి నవ్వాడు.
“ఓసి పిచ్చిదానా! రెండూ ఒకటే కాదు. వేరువేరు సందర్భాల్లో వాడే పదాలు అవి,” అన్నాడు.

భార్య వెంటనే ఆసక్తిగా,
“అలానా! అయితే ఉదాహరణతో చెప్పు,” అంది.

భర్త మాత్రం తప్పించుకోవాలని చూసాడు.
“అయ్యో… ఇప్పుడెందుకు అవన్నీ? తరువాత చెప్తాను,” అన్నాడు.

కానీ భార్య పట్టువిడవలేదు.
“లేదు లేదు… ఇప్పుడే చెప్పాలి. ఉదాహరణతో చెప్పు,” అని పట్టుబట్టింది.

భర్త కొంచెం ఆలోచించి చిరునవ్వు నవ్వాడు.
“సరే విను,” అన్నాడు.

“Complete అంటే ఒక పని పూర్తవడం. ఉదాహరణకి… నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావ్ కదా! అది నీ జీవితంలో ఒక ఆపరేషన్ complete అయినట్టే.”

అది విని భార్య నవ్వింది.
“అయితే finish అంటే?” అని మళ్లీ అడిగింది.

భర్త వెంటనే నవ్వుతూ అన్నాడు—
“నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి… నా జీవితం finish అయిపోయింది!”

అంతే… ఆ మాట విన్న భార్య మొదట ఒక్కసారిగా షాక్ అయింది. తరువాత భర్తను చూసి కోపంగా నటించింది. కానీ కాసేపటికి ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.

ఆ రోజు నుంచి ఆ ఇంట్లో complete మరియు finish అనే పదాలు వినిపించినప్పుడల్లా ఇద్దరికీ ఆ సరదా సంఘటన గుర్తొచ్చి నవ్వు ఆగేది కాదు.

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి

  ఓపికతో సాగితేనే విజయ తీరానికి చేరవచ్చు "ఈశ్వరీ పాండే "స్ఫూర్తి మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. ...