24, జులై 2026, శుక్రవారం

మంచు శిఖరాల మధ్య పుట్టిన సంకల్పం…

మంచు శిఖరాల మధ్య పుట్టిన సంకల్పం…

పర్వతాలంత అచంచలమైన ధైర్యం…

తన ప్రాణం కంటే ప్రజల భవిష్యత్తే గొప్పదని విశ్వసించిన పోరాటం…
మరణాన్ని సైతం చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన శ్వాసనే ఉద్యమంగా మార్చుకున్న మహోన్నత పోరాట యోధుడు సోనమ్ వాంగ్చుక్.

నిజం కోసం నడిచిన అడుగులు ఎన్నడూ అలసిపోవు,
న్యాయం కోసం పలికిన స్వరాలు ఎన్నడూ మూగపోవు.
కాలం కత్తిలా కోసినా, కుట్రలు విషనాగులా కాటేసినా,
సత్యపు దీపం ఆరిపోదు… ధర్మపు దారి మారిపోదు.

అబద్ధాల మేఘాలు ఆకాశమంతా కమ్ముకున్నా,
అంతరంగంలో వెలిగే నిజం సూర్యుడై ఉదయిస్తుంది.
ప్రతిఘటనల ప్రవాహంలో ఎదురు ఈదగలిగినవాడే,
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే చరిత్రకారుడవుతాడు.

విద్య వెలుగు ఆరిపోకూడదని,
తన జీవితాన్నే దీపంలా దహించుకుంటూ వెలిగిస్తున్న త్యాగశీలి.
అణచివేత ఎదుట తలవంచని ఆత్మగౌరవం,
అన్యాయం ఎదుట వెనుకడుగు వేయని ధైర్యసాహసం.

గాయాలన్నీ గాథలై, కన్నీళ్లన్నీ కీర్తులై,
త్యాగాలన్నీ తరాలకు దిక్సూచులై మారేలా
దేశంలో మార్పు కోసం పోరాడుతున్న ఒకేఒక్కడు..

అతనే సోనమ్ వాంగ్చుక్…

✍️
కోట దామోదర్
మొబైల్ 9391480475

కామెంట్‌లు లేవు:

జీవితం ఆశ-నిరాశల సంగమం:

  జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...