2, జనవరి 2023, సోమవారం
అంతరించిపోతున్న రజక వృత్తి
30, డిసెంబర్ 2022, శుక్రవారం
శాంతమ్మ ఇంజమూరి
చేయాలనే తపన ఉంటె వయస్సుతో సంబంధంలేదనడానికి ఉదాహరణ "ఇంజమూరి శాంతమ్మ" . 90 ఏళ్ళ వయసులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అంతేగాక ఆమె ఇంకా ఆరోగ్యాంగా ఉండటం చాల గొప్ప విషయం. ఇప్పటికీ శాంతమ్మ కంటిచూపు మందగించలేదు. బీపీ, షుగర్ వ్యాధులు ఆమెకి దరికి చేరలేదు. ప్రస్తుత కాలంలో 60 ఏళ్ళు పైబడితేనే ఏ పనిచేయలేని పరిస్థితి మరి 90 ఏళ్ళ శాంతమ్మ పని ఎలా చేస్తుందనే సందేహం అందరికి కలగక మానదు. ఆమె ఆత్మస్థైర్యమే ముందుకు నడిపిస్తుంది . ఆమెలోని తపనే పనిచేసుకునేందుకు సహకరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
స్ఫూర్తివంతమైన శాంతమ్మ జీవితంగురుంచి మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పెద్దముప్పారం గ్రామం పద్మశాలికి చెందిన ఇంజమూరి శాంతమ్మ. ఆమె వయస్సు దాదాపు 90 సంవత్సరాలు. శాంతమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సహా 7 మంది సంతానం. మనువళ్లు, మనువరాళ్లు మునిమనువళ్లు కూడా. కొడుకులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మనువళ్లు, మనువరాళ్లు సహా అందరూ ఆమెను నవ్వులు పువ్వులు పూయించివారే. ఆమెను చూసుకోవడానికి ఎలాంటి పొరపొచ్చాలు లేని కొడుకులు. అమ్మంటే అమితమైన ప్రేమ వారికీ. అయినా సరే శాంతమ్మకు కొడుకుల దగ్గర ఉండటంకన్నా తన సొంతూరైన పెద్దముప్పారంలోనే ఉన్నాడటానికి ఆసక్తి చూపుతుంది. పల్లె ప్రాంత పలకరింత, పల్లెప్రజల పులకరింత అన్నట్లుగా. ఎందుకో శాంతమ్మ కు ఊరంటే అంత ప్రేమ. ఆమెకు 90 ఏళ్ళు నిండిన కర్ర సహాయంతో తడబడని అడుగులు, ఆమెవి అద్దాలు లేకుండా టీవీ చూడగలిగే నేత్రాలు, ఎంతదూరమున్నవారినైనా గుర్తుపట్టే కంటిచూపు, స్వతహగా వంట వండుకొని తినే శక్తి సామర్థ్యం. అంతేగాక మూడుపూటలు తిని అరిగించుకొనే చక్కని ఆరోగ్యం ఆమెది. ఆమెకు ఎలాంటి కాళ్ళ నొప్పులు లేవు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆమె ఇంజక్షన్ వేసుకోక ఎన్నో ఏళ్ళు గడిచాయి. నిజాం మరియు రజాకార్లు ఆకృత్యాలకు, హింసకు ఎదురొడ్డి నిలిచిన సంఘటనల గురుంచి సవివరంగా ఆమె ఇప్పటికి చెప్పడం గొప్ప విషయం అంతేగాక ఆమెయొక్క అద్భుతమైన జ్ఞాపక శక్తిని మనమందరం అబినందించాలిసిన అవసరం ఉంది. బస్సు, ఆటోల సౌకర్యం లేని ఆ రోజుల్లో ఏ ప్రాంతానికైనా వెళ్లాలంటే కాలినడకే మార్గం అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు శాంతమ్మ ఇప్పటికి వివరించడం చాల గొప్ప విషయం.
శాంతమ్మ ఇంత ఆరోగ్యాంగా ఉండటానికి కారణం రహస్యమే అనుకుంటే మాత్రం పొరపాటే. ఆరోగ్యాంగా ఉండటానికి ముఖ్య కారణం ఆమె పాటించే ఆహార నియమ నిబంధనలు. అంతకంటే ముఖ్యకారణం ప్రశాంతత వాతావరణంలో ఉండటానికి ఇష్టపడటం మరియు అప్పట్లో రసాయనాలు వాడకంలేని ఆహారం అందింది. కానీ ఈరోజుల్లో అసాధ్యం అనిచెప్పాలి. కోట్లరూపాలున్న ఆరోగ్యాంగా ఉంటామనే గ్యారంటీలేని జీవితాలు ఈ రెండింటి వల్ల అనారోగ్యంపాలవుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము అంతేతప్ప ఆహార నియమాలు పాటించడానికి విముఖుత చూపుతాం అందుకే ఆరోగ్యాంగా ఉండాలనే తపన ఉండాలి, ఆరోగ్య నియమాలు పాటిస్తుండాలి. అప్పుడే చక్కని ఆరోగ్యం మన సొంతం.
గత రెండురోజులక్రితం పెద్దముప్పారంలో తన ఇంట్లో ఎలాంటి కర్ర సహాయం లేకుండా ఇల్లు ఊడుస్తూ కనిపించిన వీడియో నాకెందుకో ఆశ్చర్యమనిపించింది, ఆనందమనిపించింది.
మీ
కోట దామోదర్
మొబైల్ : 9391480475
24, డిసెంబర్ 2022, శనివారం
క్రిస్మస్
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏసుక్రీస్తు జన్మించి నేటికీ రెండు వేల సంవత్సరాలు గడిచినా భక్తుల మనుసులో ఇంకా ఆయన అనంత కరుణామయుడిగా, అపార కృపాశీలుడు, లోక రక్షకుడిగా, ప్రపంచ శాంతి దూతగా క్రైస్తవుల ఆరాధనను అందుకుంటున్నాడు.
క్రిస్మస్ డిసెంబర్ 25 న ఎందుకు జరుపుకుంటారు?
రోమన్ సామ్రాజ్యంలోని నజరేత్ నగరంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒకరోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనిపించి 'ఓ మేరీ! మీరు దేవునిచే ఆశీర్వదించబడ్డారు. నువ్వు కన్యగా గర్భం దాల్చి కొడుకును కంటావు. మీ బిడ్డకు ఏసు అని పేరు పెట్టండి. తాను దేవుని కుమారుడనని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పినట్లే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక రాత్రి అతనికి కలలో దేవదూత కనిపించి, 'మేరీని పెళ్లిచేసుకోవాలి అని చెపుతారు. దేవుడి దీవెనతో ఆమె గర్భవతి అయింది. కనుక ఆమెకు పుట్టిన కొడుకు భగవంతుడు. తనను నమ్ముకున్న ప్రజలందరినీ పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పారు. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకు రోమన్ సామ్రాజ్యం యొక్క పాలకుడు అగస్టస్ సీజర్ తన రాజ్య జనాభాను లెక్కించడానికి మరియు గణాంకాలను సులభంగా సేకరించేందుకు వీలుగా ప్రజలందరూ డిసెంబర్ 25లోగా స్వగ్రామాలకు చేరుకోవాలని ఆయన ఆదేశించారు. రాజు ఆజ్ఞను అనుసరించి, జోసెఫ్ మరియు మేరీ వారి స్వస్థలమైన బెత్లెహేముకు బయలుదేరారు. తీరా అక్కడికి చేరుకునే సరికి ఆమెకు వసతి దొరకలేదు. చివరకు ఒక సత్ర యజమాని తన గోశాలలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఊరి పక్కనే ఉన్న పొలాల్లో గొర్రెల మందకు కాపలా కాస్తున్నారు కొందరు. ఆ సమయంలో, ఒక దేవదూత వారి ఎదురుగా ఆకాశం నుండి దిగివచ్చింది. దూత చుట్టూ కాంతి వ్యాపించడంతో గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వారితో, 'భయపడకండి, మీకు శుభవార్త తీసుకురావడానికి నేను ఇక్కడకు వచ్చాను' అని చెప్పాడు. ఈరోజు బేత్లెహేములోని ఒక తొట్టిలో మీ అందరికీ ప్రభువు అయిన లోక రక్షకుడు జన్మించాడు. ఒక పసికందును బట్టలతో చుట్టి, తల్లి కడుపులో తొట్టిలో పడుకోబెట్టారు. ఇవే మీకు సంకేతాలు. లోక రక్షకుడని చెప్పాడు. అతను ఈ విషయం గొర్రెల కాపరులకు చెబుతుండగా, ఆ ప్రాంతమంతా పరలోకం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వచ్చిన దేవదూతలు భగవంతుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ అదృశ్యమయ్యారు. కాపరులు దేవదూత చెప్పిన గొర్రెల దొడ్డి వద్దకు పరుగెత్తారు. అక్కడ మేరీ, జోసెఫ్‌లు తొట్టిలో పడి ఉన్న శిశువును చూశారు. దేవదూత తమకు చెప్పినట్లు వారు అందరికీ చెప్పారు. రెండు వేల సంవత్సరాల క్రితం యేసు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల తర్వాత జన్మించాడు. అంటే డిసెంబర్ 25న పుట్టిన రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు.
క్రిస్మస్ చెట్టు కథ ఏంటి?..
చాలా సంవత్సరాల క్రితం, క్రీస్తు పుట్టిన రోజున, ప్రజలు చర్చికి వెళ్లి ఏదో ఒక రకమైన బహుమతి ఇచ్చేవారు. ఒకరోజు ప్లాబో అనే బాలుడికి పేదరికం కారణంగా ఏమి ఇవ్వాలో తోచక తనకు కనిపించిన ఒక అందమైన మొక్కను తీసుకొని చర్చిలో క్రీస్తు ముందు ఉంచాడు. కొద్దిసేపటికే ఆ చిన్న మొక్క ఏపుగా పెరిగి అందరి కళ్ల ముందు బంగారు రంగును సంతరించుకుంది. ఇది క్రీస్తు ద్వారా లభించిందని నమ్మిన ప్రజలు క్రిస్మస్ చెట్టును పెట్టడం ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు అబుదాబిలోని ఓ హోటల్‌లో ఉంది. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన దీని విలువ ఒక మిలియన్ పది మిలియన్ డాలర్లు. ఇది 181 వజ్రాలు, ముత్యాలు మరియు విలువైన రాళ్లతో అలంకరించబడింది.
మీ
కోట దామోదర్
మొబైల్ 9391480475
19, డిసెంబర్ 2022, సోమవారం
చూలాల: వెలకట్టలేని చీపురుకట్ట
13, డిసెంబర్ 2022, మంగళవారం
రైతుని రాజుల చూడాలి
దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవాడు
జవాన్.. (సైనికుడు),
మనిషి ఆకలిని తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించేవాడు కిసాన్ (రైతు)..
దేశాన్ని కంటికి రెప్పలా రక్షించే జవాన్ ఎంత ముఖ్యమో, దేశ ప్రజల క్షుద్బాధ (ఆకలి) నుండి మనల్ని రక్షించే అన్నదాతకూడా అంతే ముఖ్యం.
ఈ ఇద్దరి శ్లాఘనీయ సేవలకు గుర్తింపుగా“జై జవాన్”, “జై కిసాన్”నినాదాలతో మన దేశం వారిని కీర్తిస్తుంది. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు. మనిషి జీవనానికి ఆహారం అత్యవసరం, ఆహారాన్ని సృష్టించే రైతన్నే లేకుంటే మనిషి జీవించడం అసాధ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక అని రైతులను అభివర్ణిస్తారు. అందుకే 'రైతే రాజు' అన్నారు.
రైతు నాయకుడు (రైతు బంధు):
భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత కర్షక నాయకుడు చౌదరి చరణ్ సింగ్ డిసెంబర్ 23, 1902న ఉత్తరప్రదేశ్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం కోసం జరిపిన అహింసా పోరాటంలో చరణ్ సింగ్ మహాత్మా గాంధీని అనుసరించడమే కాక అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 1930లో, ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ వారు అతన్ని 12 సంవత్సరాలు జైలుకు పంపారు. స్వాతంత్య్రానంతరం అయన రైతు ప్రయోజనాలకోసం, రైతు చట్టాలకోసం ఎనలేని కృషిచేశారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై పరిభ్రమించేవి. ఆయన ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో కీలకపాత్ర పోషించి రైతులకు మేలు చేసే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూసంస్కరణ చట్టాలలో మార్పుల కొరకు జమీందారీ వ్యవస్థ రద్దు చేయాలనీ అనేక ఉద్యమాలు చేపట్టి జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. అంతేకాదు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని చౌదరి చరణ్ సింగ్. రైతు చట్టాల మార్పు కోసం కృషి చేసిన చరణ్ సింగ్ “రైతు బంధు” గా పేరుగాంచిరైతుల మనస్సులలో ప్రత్యేక ముద్ర వేశారు. రైతుల కోసం చరణ్‌సింగ్ చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం “జాతీయ రైతు దినోత్సవం" గా ప్రకటించింది. కర్షక లోకానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయనసమాధికి“కిసాన్ ఘాట్”గా నామకరణం చేసారు.
హరిత విప్లవం:
హరిత విప్లవం 1961లో ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్న సమయంలో ఈ విప్లవం ప్రారంభమైంది. హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని "రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్" ఈ విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించేందుకు కృషి చేసింది. అప్పటి భారత వ్యవసాయ మంత్రి MS స్వామినాథన్ నార్మన్ బోర్లాగ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు. భారత ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉన్నప్పటికీ, గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుండి దిగుమతి చేసుకున్నారు మరియు పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. అది భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది.
హరిత విప్లవంలోని ప్రధానాంశాలు:
1 . అధిక దిగుబడి వంగడాల వినియోగం.
2 . రసాయన ఎరువుల క్రిమిసంహారక మందుల వినియోగాన్ని పెంచడం.
3 . నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి.
4 . వ్యవసాయ యాంత్రికీకరణ, వ్యవసాయ ఆధునిక శాస్త్రీయ పద్దతులను అమలు చేయడం.
హరిత విప్లవం కారణంగా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులతోపాటు పంటల దిగుబడి పెరిగింది. ఆహారధాన్యాలల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించింది.
బ్రహ్మ కంటే గొప్ప:
రైతుని చిన్నచూపు చూస్తున్న ప్రతిఒక్కరు అన్నంలేనిదే మనం బ్రతకలేమన్న విషయాన్నీ గమనించాలి. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మనిషికి ఎన్ని కోట్లరూపాయలున్నాఅన్నంతినే బ్రతకాలి తప్ప అన్నంలేనిది బ్రతకలేడు. మనిషి బ్రతికున్నంతవరకు అన్నం తప్పనిసరి. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నం పండించే రైతులు బ్రహ్మ కంటే గొప్పవారు. ప్రపంచానికి అన్నం పంచే రైతును "అన్నదాత" గా అభివర్ణించారు మన పూర్వీకులు.
రైతు చట్టాలు మారినా, రైతు కష్టాలు మారలే..
మన దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తున్నాయి కానీ ఒక వ్యవసాయరంగం మాత్రమే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం శోచనీయం. సారవంతమైన భూములు, తగినంత నీరు, సకల సౌకర్యాలన్నీ ఉన్నా గిట్టుబాటు ధరలేక రైతు మనుగడ సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రభుత్వాలు చెబుతున్నా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో మాత్రం క్రియాశూన్యంగా ఉంటున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణమాఫీలు కేవలం వ్యవసాయం చేయని భూస్వాములకుఅందుతున్నాయి తప్ప భూమిలేక ప్రత్యక్షంగా దుక్కి, దున్ని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుకు మాత్రం అందడంలేదు. 10 ఎకరాలకంటే ఎక్కువఉన్న రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే రుణాలు అందుతున్నాయి కానీ గుంట భూమిలేని కౌలురైతుకి రుణాలందకపోవడం శోచనీయం. ఒక వైపు గిట్టుబాటు ధరలేక రైతు నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వంనుండి వచ్చే రుణాలందక కౌలురైతు వ్యవసాయంపట్ల విముఖత చూపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాణ్యమైన విత్తనాల కొరత వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పెట్టుబడి పెరిగిపోతోంది. రైతు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించే మద్దతుధర గిట్టుబాటుధరలేక, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతు నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీర్చడంకొరకు రైతులు కూలీలుగా మారుతున్నారు. కొందరు ఇతర పనులమీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరికొందరు రైతులు భూములను కౌలుకిచ్చి పట్టణప్రాంతాలకు వలసపోతున్నారు. కొంతమంది రైతులు ప్రభుత్వ రుణాలందక పంట పండించడానికి అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
కోట దామోదర్
మొబైల్ : 9391480475
5, డిసెంబర్ 2022, సోమవారం
చెదిరిన "క్షౌరవృత్తి"
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కేశాలంకరణకు (క్షౌరవృత్తి) కి ప్రాచీన చరిత్ర ఉంది.
మనుషులను జంతువులనుండి వేరుచేసిన గొప్ప చరిత్ర ఈ క్షౌరవృత్తి కి ఉందనడంలో అతిశయోక్తిలేదు. కేశాలంకరణ (క్షౌరవృత్తి) మానవుని నాగరికతకు తొలి మెట్టు.
భారతదేశంలో కులాలు మరియు మతాలు ఏర్పడిననాటికంటే ముందునుండే ఈ వృత్తి ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
క్షురకర్మ అంటే క్షవరము చేయుట అని అర్ధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరిని “నాయీ బ్రాహ్మణులు” (మంగలి) అని పిలుస్తుంటారు. భారతదేశంలో క్షౌరవృత్తి చేసే వారిని ఒక్కొక్క ప్రాంతంలోఒక్కో పేరుతో ప్రత్యేకంగా పిలుస్తారు. హిందూ, సిక్కు మతాలలో వంశపారంపరంగా ఈ వృత్తిని నిర్వహించేవారిని "నాయీ" లుగా పిలుస్తుంటారు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యములకు నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.
తొలివైద్యుడు:
చారిత్రక ఆధారాల ప్రకారం క్షురకులే తొలి వైద్యులని, క్షౌరవృత్తి లో భాగంగానే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందని, అంతేగాక వైద్యులు శస్త్రచికిత్సప్రారంభించడానికి వైద్యుడి ముందు వెంట్రుకలు కత్తిరించడానికి మరియు పుండ్లు, గడ్డలు కోయడానికి కూడా క్షురకర్మ కు వినియోగించే కత్తులు, బ్లేడ్లు ఉపయోగించినట్లు ఆధారాలు రుజువుచేస్తున్నాయి.
మొదటి వైద్యురాలు (మంత్రసాని):
గతంలో ప్రసూతి వైద్యులకు (గైనకాలజిస్టు) బదులుగా ఈ వృత్తి మహిళలే స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి శిశువు జననం వరకు ‘మంత్రసాని’గా సేవలందించేవారు. మంత్రసానిగా సూలగిత్తి నరసమ్మ ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపేలా సేవలందించారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఒక మంత్రసానికి అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం.
అక్షరం రాని మంత్రసానులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సులభంగా కాన్పులు చేసేవారు.
కానీ ఇప్పుడు డాక్టర్స్ మాత్రం కత్తెరలేనిదే కాన్పులు చేయటంలేదు. వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ మంత్రసానిలా చేయటంలేదు. ఇప్పుడున్న వైద్యుల కన్నా మంత్రసాని ప్రతిభ గొప్పది.
వైద్య, విద్య రంగం అభివృద్ధి చెందిన తరువాత చాలామంది వైద్యవృత్తిని వదిలి క్షుర వృత్తిమీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
మంగళ వాయిద్యాల ప్రత్యేకత:
ప్రాచీన కాలం నుండి నాయీ బ్రాహ్మణులు(మంగళి) క్షౌరవృత్తి తో పాటు సంగీతం (మంగళ వాయిద్యాలు వాయించడం), వైద్యం కూడా వృత్తిగా నిర్వహించేవారు.
మంగళ వాయిద్యాలువాయించడంలో వీరు నిష్ణాతులు. మంగళ వాయిద్య సంగీతంలో భాగంగా వీరు సన్నాయి (నాదస్వరం),డోలు(శృంగభేరి) వాయించడం ఆనవాయితీగా వస్తోంది.
నాదోపాసన అనేది ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మంలో అంతర్భాగంగా కొనసాగుతోంది. హిందూ దేవాలయాలలో దైవారాధనకువేదాలలోఎంత ప్రాధాన్యత వుందో. నాదోపాసనకుకూడా అంతే ప్రాధాన్యత ఉంది.నాదోపాసన చేయడం సాక్షాత్తూఆ పరబ్రహ్మను పూజించడమేనని భగవద్గీత పదవ అధ్యాయం 22వ శ్లోకంలో ప్రస్తావించబడింది.
హిందూ దేవాలయాలలో, నాదస్వరం వినిపించడం సర్వసాధారణ విషయం. గర్భాలయంలో ప్రతిష్టమైన దేవుడిని మేల్కొలపడానికి మరియు దైవ ప్రార్థనకు ముందు మంగళ వాయిద్యాలను వాయించడం మనందరికీ తెలిసిన విషయం. భారతదేశంలో మంగళ వాయిద్యాలు లేకుండా ఏ శుభ కార్యమూ జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివాహం, నూతనగృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు బ్రాహ్మణుడివేద మంత్రాలకుఎంత ప్రాముఖ్యత ఉందో మంగళ వాయిద్యాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
పుణ్యక్షేత్రాలలో నాయీ బ్రాహ్మణుల పాత్ర:
హైందవ సాంప్రదాయంలో పుట్టు వెంట్రుకల తొలగింపుకు చాలా ప్రాధాన్యముంది. ఈ ప్రక్రియను ఒక వేడుకగా నిర్వహించడం మనందరికీ తలుసు. అసలు పుట్టువెంట్రుకలు ఎందుకు సమర్పించాలి అనే సందేహం కలగడం సహజమే. శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలిగించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దైవ సన్నిధిలో కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం ఒక ఆచారంగా మారింది. దైవ క్షేత్రాలలో “కళ్యాణ కట్ట” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశంలో భక్తుల తలనీలాలను దేవునికి సమర్పించేందుకు తమ సేవలందిస్తారు కేశఖండనకారులు.
మన సనాతన భారతీయ సంప్రదాయాల్లో అంతర్లీనంగా ఎన్నో శాస్త్రీయ అంశాలు దాగి ఉంటాయనేది నిర్వివాదాంశం. ఈ ఆచారవ్యవహారాలలో భాగమే "పుట్టువెంట్రకుల" వేడుక ఒకటి.
వివాహంలో నాయీ బ్రాహ్మణులపాత్ర:
సంప్రదాయబద్ధమైన రీతిలో పెళ్లి మంటపం అలంకరించిన తరువాత పందిట్లో వడ్లుపోసి వాటిపైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి నాయీ బ్రాహ్మణుడు(మంగలి) మైలపోలు తీస్తాడు. మైలపోలు అంటే పెళ్లి కుమారుడి కాలి, చేతి గోర్లు తొలగించి శుభ్రం చేస్తారు.
కేశాలంకరణ(క్షౌరవృత్తి):
మనిషి పుట్టుక నుండి మరణం వరకు నాయీ బ్రాహ్మణుడు (మంగలి) లేనిదే జీవనం ముందుకు సాగదు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఉంచడానికి శుభ్రపరచడంశుభ్రంగా మరియుమరియు అందంగా మార్చడం "నాయీ బ్రాహ్మణుల (మంగలి) వృత్తి". పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని మనిషి మరణాంతరం చేసే క్షుర కర్మలను నిర్వహించేది కూడా నాయీ బ్రాహ్మణులే. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా సేవలందించే వృత్తి "కేశఖండనకేశఖండనం". మానసిక వత్తిడి, సౌందర్య పోషణ, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి నుండి ఉపశమనం పొందడం కొరకు తైలాల మర్ధన ఎంతగా ఉపయొగపడుతాయో ప్రత్యకంగా చెప్పనవసరంలేదు. "ఎంతటివారైనా నాయీ బ్రాహ్మణుడికి తలవంచక తప్పదుాలి" అనేది జగమెరిగిన నానుడి. క్షవరం చేసే సమయంలో వీరివద్ద తలవంచనిదే క్షౌర పని పూర్తిచేయటం అసాధ్యం . ప్రతి మనిషికి తలవెంట్రుకలు శిరస్సును అందంగా అలంకరించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనిషిని అందంగా తీర్చిదిద్దడంలో నాయీ బ్రాహ్మణుల కళానైపుణ్యం అనివార్యంఎంతో ప్రత్యేకం.
తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఈ వృతిపైనే ఆధాపడి జీవిస్తున్నాయి. అయితే 2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల నాయీ బ్రాహ్మణుల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హెయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు అద్దె మరియు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో "అర్బన్ క్లాప్" లాంటి పలు సంస్థలు ఉనికి లోకి రావడంతో ఈ వృత్తే జీవనం సాగించే సాధారణ నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కులవృత్తులు కనుమరుగైపోయినా.. వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఏదేమైనా కులవృత్తులనే నమ్ముకుని అరకొర సంపాదనతో సాధారణ జీవితాలను నెట్టుకొచ్చే బడుగు జీవులతోబడా కార్పోరేట్ సంస్థలు పోటీ పడి వారి నోటి ముందు కూడును లాక్కోవడం అత్యంత శోచనీయం. ఇతర వృత్తి రాక, వంశపారంపర్య వృత్తిపై మమకారం చంపుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతుండగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర కుల వృత్తుల వారితో పాటు నాయీ బ్రాహ్మణులు కూడా తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపి రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా మారుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సభ్య సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఇక్కట్లను రూపుమాపేందుకు పటిష్టమైన ప్రణాలికను రూపొందించి ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
రచయిత:
కోట దామోదర్
మొబైల్: 9391480475
14, నవంబర్ 2022, సోమవారం
వింతలెన్నో చూడ రండి
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఒకరోజు చెట్టు నుంచి రాలిన ఆపిల్ ను గమనించి, ఆపిల్ క్రింద పడటానికి గల కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు.
ఒక వస్తువును పైకివిసిరినపుడు తిరిగి ఆ వస్తువు కిందకు పడటానికి కారణం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటంవల్లనే అని మనం చిన్నపుడు పాఠ్యపుస్తకాలల్లో చదువుకున్నాం.
కానీ పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి కలగడం సహజమే ..
గురుత్వాకర్షణ శక్తి ధిక్కరించిన చోట పైకి విసిరిన వస్తువు కిందపడకుండా ఉండటం సాధ్యమే అని చెప్పొచ్చు. ఈ భూగోళం అంతా గురుత్వాకర్షణ శక్తి కలిగివుందని మనకు తెలుసు. కానీ ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ప్రదేశాల గురుంచి మాత్రం చాలా మందికి తెలియదు
ప్రపంచంలో కేవలం 5 ప్రదేశాలలోమాత్రమే గురుత్వాకర్షణ శక్తి పనిచేయదని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు.
భారత దేశంలోని, లడఖ్
కేంద్రపాలిత ప్రాంతం, లేహ్ జిల్లాకి 30 కిలోమీటర్ల
దూరంలో గల ప్రదేశాలు సుందర మనోహరమైన దృశ్యాలతో పర్యాటకులనుఆకర్షిస్తాయి. అటువంటి
అద్భుతమైనఆకర్షణలలో “మాగ్నెటిక్ హిల్” (అయస్కాంత కొండ)ఒకటి. ఇది సముద్రమట్టం కంటే 14,000 అడుగుల
ఎత్తులో ట్రాన్స్-హిమాలయన్ ప్రాంతంలో లేహ్-కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది.
మాగ్నెటిక్ హిల్ తూర్పున సింధు నది ప్రవహిస్తుంది. మాగ్నెటిక్ హిల్ ప్రాంతం
చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసిన ఒక పసుపు రంగు సైన్ బోర్డు పర్యాటకుల దృష్టిని
ఆకర్షిస్తుంది. "అయస్కాంత కొండ, గురుత్వాకర్షణను
ధిక్కరించే దృగ్విషయం. మీ వాహనాన్ని రోడ్డుపై తెల్లటి పెయింట్‌తో గుర్తు పెట్టబడిన
పెట్టెలో పార్క్ చేయండి" అని రాయబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో మోటారు వాహనాల
ఇంజన్లు ఆపేసినా సరే అవి కొండ వైపు గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో సాగిపోతుంటాయి.. ఈ
ప్రాంతం యొక్క లేఅవుట్ మరియు చుట్టుపక్కల వాలులు కొండ యొక్క ఆప్టికల్ భ్రమను
సృష్టిస్తాయి. కొండ రహదారి నిజానికి లోతువైపు ఉన్న రహదారి. కొండ రహదారిపై ఉన్న
వస్తువులు మరియు కార్లు నిజానికి లోతువైపుకు దొర్లుతున్నప్పుడు గురుత్వాకర్షణ
శక్తికి ధిక్కరించి ఎత్తుపైకి దొర్లినట్లు కనిపిస్తాయి. అలా వెనక్కి ఎందుకు
వెళ్తున్నాయో ఎవ్వరికి అర్ధంకాని వింత. ఇటుగా వచ్చే టూరిస్టులు మాత్రం విచిత్రమైన
ఈ అయస్కాంత కొండని చూసి అబ్బురపడుతుంటారు.ఈ కొండ సమీపంలోకి రాగానే హెలికాప్టర్ల
వేగంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని అంటారు. జూలై మరియు అక్టోబర్నెలలు ఈ మాగ్నెటిక్
హిల్ సందర్శించడానికి అనువైన సమయం.
సిద్ధాంతాల ప్రకారం:
ఈ కొండకి అయస్కాంత శక్తి ఉండటంవల్ల ఇలా జరుగుతుందని కొందరి నమ్మకం, మరి కొందరు
మాత్రం ఈ కొండ ప్రాంతంలో కంటికి కనిపించని అదృశ్యశక్తులు ఉన్నాయని, మరికొందరు
మాత్రం ఆప్టికల్ ఇల్యూషన్ ( దృశ్య భ్రమ) అని . ఇది చుట్టుపక్కల భూమి యొక్క లేఅవుట్
ఆప్టికల్ భ్రమను ఉత్పత్తి చేసే ప్రదేశం , ఇది కొంచెం లోతువైపు
వాలుగా కనిపిస్తుంది. ఎత్తుపైకి వాలు. అందువల్ల, గేర్
వదిలివేయబడిన కారు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి దొర్లుతున్నట్లు
కనిపిస్తుందని అంటుంటారు.
2 . సెయింట్
ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (Saint Ignace Mystery Spot, Michigan, USA).
3 . మిస్టరీ
స్పాట్, శాంతాక్రజ్, కాలిఫోర్నియా (Mystery
Spot, Santa Cruz, California)
సాధారణంగా జలపాతంలోని నీరు పైభాగం నుండి కిందకు పడటం సహజం. ఇక్కడమాత్రం నీరు కిందకు కాకుండా పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండటం వల్లే ఇలా జరుగుతుందని కొందరంటుంటే మరి కొందరు మాత్రం జలపాతం నుంచి వచ్చే నీటిని గాలి పైకి పంపేస్తోంది గంటకు 75 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలి వీయడం అటువంటి దృగ్విషయాలకు కారణమవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.
5 . హూవర్ డ్యామ్, నెవాడా, అమెరికా (Hoover
Dam, Nevada, USA)
ఈ డామ్ అమెరికా లోని అరిజోనా, నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ గా పిలిచేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. లాస్ వేగాస్ నుండి హూవర్ డ్యామ్ వరకు సుమారు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హూవర్ డ్యామ్ కి వెళ్లిన వారికి అక్కడున్న అద్భుతాలనుచూస్తే ఆశ్చర్యంకలిగిస్తుంది. హూవర్ డ్యామ్ పై నుంచి ఓ బాటిల్ తో నీటిని కిందకు జార విడిస్తే, ఆ నీరు కిందకు పడకుండా. పైకి ఆకాశంవైపు వెళ్తుంది. ఎన్నిసార్లు నీరు జార విడిసినా. నీరు పైకే వెళ్తుంది. నమ్మశక్యం కానీ ఈ అద్భుతాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్య పోకుండా ఉండలేరు. శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత వారు చెప్పిన సమాచార ప్రకారం ఆ డ్యామ్ దగ్గర గాలి కింద నుంచి పైకి బాగా ఎక్కువగా వీస్తోందని. ఆ గాలి నీటిని పైకి తోసేస్తుందని. అందుకే ఇలా జరుగుతోందని వెల్లడించారు. అయినా పర్యాటకులకు ఇదొక వింత లాగే అనిపిస్తుంది.
మీ
కోట దామోదర్
మొబైల్ : 9391480475
kotadamodar.blogspot.com
8, నవంబర్ 2022, మంగళవారం
అంతరించిపోతున్న కుమ్మరి వృత్తి
2, నవంబర్ 2022, బుధవారం
అందరికి ఆదర్శం అంధురాలు "పయ్యావుల కొమురమ్మ"
జీవితం ఆశ-నిరాశల సంగమం:
జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...
-
మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'. మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం ప...
-
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏసుక్రీస్తు జ...
-
మా ఊరి జ్ఞాపకాలు: మా ఊరు గుమ్మడవెల్లి. ఊరు చుట్టూ చూడచక్కని పచ్చని పంటపొలాలు. ఊరినడుమ ఊట బావులు, ఊరి చివరన చెలిమ భావి. ఊరి నట్టనడుమ రాములవార...















