24, అక్టోబర్ 2022, సోమవారం
మల్లు స్వరాజ్యం
అంతరించిపోతున్న కల్లుగీత వృత్తి
- · తాటి కల్లు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
- · డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
- · అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలనుదూరం చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
- · కంటిచూపును, జుట్టు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
- · నీరాలో ఉండే ప్రో బయాటిక్స్ రోగనిరోధక శక్తి పెరుగడానికి దోహదం చేస్తుంది.
- · లీవర్ లేదా కాలేయసంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
- · కిడ్నీలో రాళ్లను నివారించడంతో పాటు అప్పటికే ఏర్పడిన రాళ్లను కరిగిస్తుంది.
- · తాటిబెల్లం, తాటి పంచదార వల్లకూడా మంచి ప్రయోజనాలున్నాయి.
- · తాటికల్లుకు క్యాన్సర్కారక కణాలను నశింపజేసే శక్తి కూడా ఉందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.
17, అక్టోబర్ 2022, సోమవారం
సరిలేని చిత్రకారుడు
దేవుడు మనిషిని సృష్టిస్తే! అసలు దేవుడు ఎలా ఉంటారో తెలియని ప్రపంచానికి ఆ దేవుడి రూపాన్ని సృష్టించిన గొప్ప చిత్రకళాకారుడు "రాజా రవి వర్మ ".
తాను చదివిన పురాణేతిహాస గ్రంథాల్లోని దేవతామూర్తులను, వారి ఆకారాలను ఎంతో గొప్పగా ఊహించుకొని అద్భుతమైన ఆలోచనతో తన కుంచె ద్వారా దేవుళ్లు, దేవతల రూపాలకి ప్రాణంపోసిన కళాకారుడు. మనం నిత్యం పూజించే దేవుళ్ళు దేవతల విగ్రహాలన్నీ అయన గీసిన చిత్రాల ఆధారంగానే రూపొందించారంటే చిత్రకళ ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. భారతదేశ చిత్రకళను ప్రపంచవ్యాప్తి చేయటమే కాకుండా ఆ కళకు అరుదైన గౌరవం తీసుకొచ్చారు.
అనబత్తుల కుంచె నుండి జాలువారిన చిత్రాలు ఖండాంతర ఖ్యాతి పొందాయి. ఆయనది వృత్తి బోధన అయినా, చిత్రకళే ప్రవృత్తిగా కళాఖండాలను ఆవిష్కరిస్తున్న "అనబత్తుల వెంకన్న" తన బాల్యమునుండి చిత్రకళపై మక్కువతో అవిశ్రాంత సాధనతో ప్రపంచ స్థాయిలో గొప్ప చిత్రకళాకారుడిగా గోల్డ్ మెడల్, జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో సాధించిన "అనబత్తుల వెంకన్న" తెలంగాణకు చెందినవారు కావడం గర్వించదగ్గ గొప్ప విషయం.
- 2012 లో KVS National Incentive Award” కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
- 2021 సంవత్సరం అంతర్జాతీయ ఆర్ట్ సొసైటీ, ఫైన్ ఆర్ట్స్, అస్సాం, వారిచేత గోల్డ్ మెడల్ సాధించారు.
- 2022 సంవత్సరంలో Magic Book of Records, ఫరీదాబాద్, న్యూ ఢిల్లీ వారిచేత అత్యున్నతమైన Honorary Doctorate Award అవార్డు సాధించారు.
- 2022 సంవత్సరంలో లలిత్ కళా కేంద్ర, Guwahati, అస్సాం వారిచే "Diamond Award" పొందారు.
- 2021 సంవత్సరంలో "కళ రత్న" అవార్డు సాధించారు.
- 2005 లో ఆఫ్రికా దేశం తన ప్రతిభకు ఆ దేశ అత్యున్నతమైన "ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.
బాల్యం, విద్యాబ్యాసం:
సూర్యాపేట జిల్లా, మారుమూల గ్రామమైన మద్దిరాల మండలం, గుమ్మడవెల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబం చేనేత కార్మికుడైన అనబత్తుల నారాయణ, నాగలక్ష్మి దంపతులకు 08.03.1969 లో జన్మించారు. నారాయణ చేనేత వృత్తినే కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వెంకన్న అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆయనకి 7 వ తరగతిలోనే చదువుతో పాటు చిత్రకళపై ఆసక్తి కలగటం జరిగింది. వెంకన్న గీసిన చిన్న చిన్న చిత్రాలను చూసి తల్లిదండ్రులు సంతోషించేవారూ మరియు అభినందించేవారు కూడా. తన తల్లిదండ్రుల ప్రోత్సాహముతో మరింత ఉత్సహంతో కళకు పదునుపెట్టగలిగారు. అప్పట్లో గుమ్మడవెల్లి గ్రామంలో 8 వ తరగతి చదివే సదుపాయంలేక వెంకన్న చిన్నమ్మ గారి ఊరు నెల్లికుదురులో స్థిరపడి అక్కడే 8 వ తరగతి నుండి 12 వరకు జూనియర్ కళాశాలలో విద్య పూర్తిచేశారు. 8 వ తరగతి చదివే సమయంలో వారి గురువు చిత్రకళ నైపుణ్యం కలిగిన అక్కెర కరుణ సాగర్ గారి దగ్గర శిక్షణతో పాటు నైపుణ్యం పొందగలిగారు. ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ లో శ్రీ టీ.సుధాకర్ రెడ్డి గారి దగ్గెర గ్రాఫిక్స్ లో శిక్షణ పొందినారు వెంకన్న ఈ స్థాయికి చేరుకున్నారంటే గురువులే కారణం, గురువులే ఆదర్శం. వెంకన్న చిన్నతనం నుండి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ తన కళను విడిచిపెట్టకుండా విద్యను మరియు చిత్రకళను రెండింటిని కొనసాగించారు. నెల్లికుదురులో విద్య అనంతరం. అయన విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచ్లర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ విభాగం లో డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ (నటన మరియు దర్శకత్వం) పూర్తిచేశారు. తరువాత ఎం. ఎస్. యూనివర్సిటీ, బరోడాలో ఎం. ఏ. గ్రాఫిక్స్ పూర్తి చేశారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెంకన్నచదువుతోపాటు గొప్ప చిత్రకళాకారుడిగా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. తండ్రి నేత కళాకారుడైతే, తనయుడు మాత్రం గొప్ప చిత్రకళాకారుడిగా అవార్డులు పొందడం గొప్ప విషయం.
ఉద్యోగ ప్రస్థానం :
- 1995 లో కేంద్రీయ విద్యాలయ సంగతన్ టీ.జి .టీ ఆర్ట్ టీచర్ గ హైదరాబాద్ లోని కే .వి 2 ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో చేరారు.
- 2000 - 2004 వరకు కే .వి 1 గోల్కొండ, లంగర్ హౌస్ పనిచేసి 2004 ఫిబ్రవరి లో బోట్స్వానా ( ఆఫ్రికా ) కు భారత ప్రభుత్వం తరుపున డెప్యూటేషన్ పై వెళ్లి ఐదు సంవత్సరాలు అక్కడి విద్యార్థులకు చిత్ర కళలో మెళకువలు నేర్పిచారు . వెంకన్న చిత్రకళా నైపుణ్యాన్ని చూసి ఆఫ్రికా దేశంలోని అత్యున్నతమైన " ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా " అవార్డు తో సత్కరించింది.
- 2009 లో తిరిగి కే .వి,1 ఉప్పల్ హైదరాబాద్ లో చేరారు.
- 2011 నుండి కే .వి వరంగల్ లో చిత్ర కళ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు.
వెంకన్న సాధించిన అవార్డులు:
- 1987 లో ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
- 1988 లో భారతిదాసన్ యూనివర్సిటీ, తిరుచిరాపల్లి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.,
- 1989 లో ఆంధ్ర యూనివర్సిటీ పోస్టర్ తయారీ కాంపిటీషన్ లో మొదటి బహుమతి.
- 1990 లో కాలికట్ యూనివర్సిటీ - కేరళ, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.
- 1990 లో REC,వరంగల్ అల్ ఇండియా ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ ఫెస్టివల్ సందర్బంగా మొదటి బహుమతి.
- 1991 లో మదురై కామరాజ్ యూనివర్సిటీ లో అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ సందర్బంగా రెండవ బహుమతి.
- 1992 లో Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
- 1993 లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి "దాసరి నారాయణరావు - "గోల్డ్ మెడల్" అవార్డు పొందారు.
- 1997 లో Highly Commendable certificate అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ , వారిచేత పొందారు.
- 2011 లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 324C 2 ఆచార్య సేవ పురస్కార్” హైదరాబాద్, వారిచేత పొందారు.
- 2011 లో KVS Regional Incentive Award” కేంద్రీయ విద్యాలయ సంగతన్, Ministry of HRD, Govt of India వారి చేత అత్యున్నతమైన అవార్డు పొందారు.
- 2015 లో “Best Teacher award” by రోటరీ క్లబ్ హన్మకొండ , వరంగల్ - తెలంగాణ స్టేట్ వారి చేత పొందారు
- 2016 లో “Active Teacher award” కళాభారతి చైల్డ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్, ఔరంగాబాద్ వారిచేత పొందారు.
- 2017 లో “Best Artist” కళ వైభవం ఆర్ట్ ఎక్సిబిషన్ - వరంగల్ వారిచేత పొందారు.
- 2017 లో తెలంగాణ స్టేట్ Rs. 51,116 నగదు తో పాటు “District Artist Award" డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కడియం శ్రీహరి గారిచే పొందారు.
- 2019 లో యంగ్ ఎంవోయిస్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ వారిచే బాపూజీ స్మృతి పురస్కార్ అవార్డు పొందారు.
- 2021 లో గ్రాఫిక్ డిజైన్- న్యూ ఢిల్లీ వారి చేత గోల్డెన్ ఫ్రేమ్ అవార్డు పొందారు.
19, సెప్టెంబర్ 2022, సోమవారం
సమానత్వం కోసం పోరాటం

ఇది నా దేశం, ఇది నా జన్మభూమి, ఈ దేశం నాది అని గర్వంగా చెప్పుకునే ఈ దేశ పౌరిడిని నేను. ఈ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించటానికి అర్హత కలిగినవాడిని. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి తిరస్కరిస్తారా ? ఎందుకు ప్రవేశం లేదు? కారణం నా వర్ణమా? అయితే విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? అయితే నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అలుపెరగని ఉద్యమ వీరుడు. నడవరా ముందుకని నడిపించిన నల్ల వీరుడు.
ఓక్లహామా యూనివర్సిటీలో మొట్ట మొదటి నల్లజాతి విద్యార్థిగా చరిత్రలో నిలిచారు.
వివక్ష చూపించినా:
కాన్సాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందిన తరువాత ఆయన లాంగ్‌స్టన్ విశ్వవిద్యాలయం లో అత్యధిక కాలం ప్రొఫెసరుగా పనిచేసి జనవరి 28, 1948న రిటైర్మెంట్ తీసుకున్నారు. మొదటినుండి చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంవల్ల అయన ఉద్యోగ విరమణ తరువాత 61 సంవత్సరాల వయసులో కూడా మరొక డిగ్రీ కోసం ఓక్లహోమ యూనివర్సిటీ లో ప్రవేశం కొరకు సెప్టెంబర్ లో దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 20, 1948 న ఆయన ధరఖాస్తుని నిరాకరించింది ఓక్లహోమ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఈ దేశ పౌరిడినైనా నాకు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నిరాకరిస్తారా? ఎందుకు ప్రవేశం లేదు? నేను ఈ దేశ పౌరిడిని కాదా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగా తాను నల్లజాతీయుడనే కారణంతో దరఖాస్తుని నిరాకరించినట్లు యూనివర్సిటీ వారు తెలిపారు. విద్యనభ్యసించటానికి వర్ణం కారణమా? తెల్లజాతీయులే చదవాలి గాని నల్లజాతీయులు చదువకూడదా? అయితే ఈ విషయాన్నీ నేను న్యాయస్థానంలో తేల్చుకుంటా అని శపథం పట్టి వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి మెక్‌లౌరిన్ ఫెడరల్ కోర్టుకి వెళ్లారు. అక్టోబర్ 14, 1948న తరగతులు ప్రారంభం కానున్నాయి. తక్కువ సమయం ఉండటంవల్ల తన ప్రవేశానికి అనుమతి దొరుకుతుందా అన్న సందేహంతో సతమతపడుతున్న సందర్భంలో ఫెడరల్ కోర్టు వారు సెప్టెంబరు 29, 1948, తీర్పులో అతనికి ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడంతో అతను విజయం సాధించాడు. అతనికి కోర్టు తీర్పు అనుకూలంగా ఉండటంతో ఓక్లహోమ స్టేట్ రీజెంట్‌లు అక్టోబరు 11, 1948న అతనిని అడ్మిషన్‌కు ఆదేశించక తప్పలేదు, అక్టోబర్ 14, 1948న మెక్‌లౌరిన్ తరగతులకు హాజరైనారు.
అసమానత విద్యకు గురైనారు:
అడ్మిషన్‌కు ఆదేశించినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తరగతి గదిలో అకృత్య రూపాన్ని చూశారు. అతను చదువుతున్న తరగతి గదిలో తెల్లజాతీయుల విద్యార్థులకు దూరంగా వేరు డెస్క్ మరియు చైర్ తో తరగతి గది వెలుపల తలుపు ప్రక్కన కూర్చొని పాఠాలు వినేలా ఏర్పాటుచేశారు. అలా తరగతులన్నింటికీ హాజరవుతూనే తెల్లజాతి విద్యార్థులకు దూరంగా ఉంటూ తన అసమానమైన విద్యాబ్యాసాన్ని కొనసాగించారు. అంతేకాకుండా విద్యార్థులు తినే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో ప్రత్యేక టేబుల్స్ వద్ద భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసేవారు; అతను చదువుకోవడానికి కూడ లైబ్రరీలో వేరే టేబుల్‌ని ఉపయోగించాలని మరియు క్రీడా కార్యక్రమాలలో ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలు మరియు ప్రత్యేక విశ్రాంతి గది అలా అసమానత విద్యకు గురైనారు. అలా జరిగినప్పటికీ శ్వేతజాతీయులకంటే కూడా చదువులో ముందుడేవాడు. ఆయన ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికి దృఢమైన సంకల్పంతో తన విద్యను కొనసాగించారు. ఒకవైపు విద్యను కొనసాగిస్తూనే వర్ణ వివక్షత పోరాటానికి పదునుపెట్టగలిగారు. ఆయన ఎన్నో నల్లజాతీయుల విద్యార్థుల సంఘలని కూడగట్టి వర్ణ వివక్షత నిర్ములన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.
జీవితంలో మరిచిపోలేని రోజు:
అసమానత విద్య షరతులు వల్ల తాను సమానత్వాన్ని కోల్పోయానని పేర్కొంటూ దావా వేశారు. అయితే ఈసారిమాత్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ అతని వాదనతో ఏకీభవించలేదు మరియు జాతి విభజన అనేది "ఓక్లహోమ రాష్ట్రం యొక్క సామాజిక విధానం" అనే కారణంతో అతను వేసిన దావాను తిరస్కరించింది. అయినప్పటికీ జార్జ్ మెక్‌లౌరిన్ తన పోరాటాన్ని కొనసాగించటానికి తన కేసును ఏకంగా U.S. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాడు.సుప్రీం కోర్టు రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని అతని జాతి ఆధారంగా ఇతర విద్యార్థుల నుండి భిన్నంగా చూడగలరా అనే ప్రశ్నపై దృష్టి సారించింది.జూన్ 5, 1950 న తన కేసును విచారించి ప్రధాన న్యాయమూర్తి ఫ్రెడ్ విన్సన్, న్యాయస్థానం కోసం వ్రాస్తూ, మెక్‌లౌరిన్‌కు అందించబడిన భేదాత్మకమైన చికిత్స పద్నాల్గవ సవరణ యొక్క సమాన రక్షణ నిబంధన ప్రకారం, రాష్ట్ర అధికారులు ఇతర జాతుల విద్యార్థుల మాదిరిగానే వాదిని పరిగణించాల్సిన చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంటారని సుప్రీం కోర్టు వాదించింది.ఇలాంటి పరిమితులు అతని విద్యాబ్యాసం మరియు చర్చలలో పాల్గొనటం ఇతర అబిప్రాయాలు మార్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని మరియు నిరోధిస్తాయని. విద్యార్థులు, మరియు, సాధారణంగా, తన వృత్తిని నేర్చుకోవడానికి ఇలాంటి పరిమితులు అనుకూలించవని సూచించారు. ఇకపై న్యాయస్థానం ఇలాంటి పరిమితులను సహించదని ఓక్లహోమా స్టేట్ రీజెంట్స్ ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో మెక్‌లౌరిన్ ఆశ నెరవేరినట్లైంది. అక్టోబర్ 14 తనకి సంతోషకరమైన రోజు అని ఆయన డైరీ లో రాసుకున్నారు. నిజంగా నల్లజాతియులకు అక్టోబర్ 14 సంతోషకరమైన రోజు అనే చెప్పొచ్చు. నల్లజాతి విద్యార్థులకు నడవరా ముందుకని దారిచూపిన మార్గదర్శి మెక్‌లౌరిన్.
నల్లజాతీయుల కోసమే అయన పోరాటం:
దేశంలో మైనారిటీలైన శ్వేతజాతి ప్రభుత్వం నల్లజాతీయుల పట్ల వివక్ష పాటిస్తూ, వారిని సామాజికంగా అన్ని రంగాల్లోనూ వేరు చేస్తూ అధికారికంగా విధానాలను అమలుచేసింది. ఆ వర్ణ వివక్షా విధానాలను, వారి విద్యపట్ల వివక్షతను అంతం చేయటానికి ఎంతగానో పోరాడిన వీరుడు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి మనుసులో చిరకాల ముద్రవేసుకున్నారు. అమెరికావంటి అగ్రదేశాలల్లో నల్లజాతీయులు స్వేచ్ఛగా విద్యను కొనసాగిస్తున్నారంటే దానికి కారణం జార్జ్ మెక్‌లౌరిన్ చేసిన పోరాటమే.
కుటుంబ నేపథ్యం:
జార్జ్ డబ్ల్యూ మెక్‌లౌరిన్ 16 సెప్టెంబర్ 1894 న మిస్సిస్సిప్పి, USA లో జన్మించాడు. అతని భార్య పెనినా మెక్‌లౌరిన్, వాన్ కెనడా లో జన్మించింది. పెనినా మెక్‌లౌరిన్ ఉపాధ్యాయ వృత్తిలో 33 సం, విద్యనందించింది. ఆమె 1954లో ఓక్లహోమ యూనివర్సిటీలో హోమ్ ఎకనామిక్స్ లో మూడు డిగ్రీలు, లాంగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ మరియు బి.ఎస్ పట్ట పొందారు. అతని కుటుంబం 1910లో ఓక్లహోమాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మెక్‌లౌరిన్ కి ఇద్దరు కుమారులు, డన్బార్ ఎస్. మెక్ లారిన్, న్యూయార్క్ లో లాయర్, జోఫ్రే సి. మెక్ లారిన్, లాస్ ఏంజిల్స్ టీచర్, ఆయనకు ఒక కుమార్తె కార్డెజా మెక్ లారిన్ లాస్ ఏంజిల్స్ ఉంటుంది. మెక్‌లౌరిన్ అనారోగ్య కారణంగా సెప్టెంబర్ 4, 1968న 74 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయన మరణం నల్లజాతీయులు తీరని లోటు.
మీ
కోట దామోదర్
Mobile: 9391480475
.
అంగవైకల్యం ఆశయసాధనకు అవరోధం కాదు
29, ఆగస్టు 2022, సోమవారం
స్నేహానికి సరిరావన్న పలుకాడె బంధువులున్నా.
స్నేహానికి సరిరావన్న పలుకాడె బంధువులున్నా.
స్నేహం విలువ గురించి ఎంత చెప్పిన తక్కువే అనడంలో సందేహం లేదు. ఎందరో కవులు, వాగ్గేయకారులు అనేక భాషల్లో స్నేహం గురించి వందలాది పాటలు రాసిన కొన్ని మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రజాదరణ పొందిన పాటల్లో తెలుగు పాటలు కూడా ఉండడం తెలుగు వారందరికీ గర్వకారణం. స్నేహం విలువను పాటల రూపంలో అద్భుతంగా చిత్రించిన గేయ రచయితలను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో మన తెలుగు తేజం బహు భాష కోవిదుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నా రే గారు రచించిన నిప్పులాంటిమనిషి చిత్రంలో స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..స్నేహమేరా నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి అనే పాట అనే పాట పలు భాషల్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా 1988 లో దర్శకుడు వి. మధుసూదనరావు గారి సమర్పణలో "ప్రాణ స్నేహితులు' సినిమాలోని గేయ రచయిత భువనచంద్ర గారు రాసిన "స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా" అనే పాట ప్రతి తెలుగువాడి హృదయాన్ని దోచుకుంది మరియు స్నేహితుల హృదయాలను దోచుకుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఎవరూ స్నేహాన్ని విడిచిపెట్టరు మరియు ప్రాణ స్నేహితులను మరచిపోరు.
అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అనేది శాంతి సంస్కృతి విలువలు, వైఖరులు మరియు ప్రవర్తన సమితిగా నిర్వచిస్తూ, హింసను తిరస్కరించడం మరియు సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో వాటి మూల కారణాలను పరిష్కరించడం ద్వారా సంఘర్షణలను నిరోధించడానికి ప్రయత్నించే ప్రతిపాదనను అనుసరించే ఒక చొరవ. దీనిని 1997లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.
ప్రజలు, దేశాలు, సంస్కృతులు మరియు వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలను ప్రేరేపించ గలదని మరియు సమాజాల మధ్య వంతెనలను నిర్మించగలదనే ఆలోచనతో UN జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది.
"స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల'
ప్రతి విద్యార్థి భవిష్యత్తు తాను చదివిన చదువుపై కంటే విద్యార్థి స్నేహం పైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 100 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు మిన్న అనే నానుడి ఎప్పటికీ నిజమే. ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మరియు మంచి నడవడిక, మంచి ప్రవర్తన యొక్క మార్గాన్ని అనుసరిస్తారు ఇది ముమ్మాటికీ నిజం. ప్రపంచంలో కులం, మతం, వయోపరిమితి, ప్రాంతీయ భేదం లేనిది ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ధనిక మరియు పేదలను కలిపేది స్నేహం మాత్రమే. కులాలు, మతాలను కలిపేది స్నేహం ఒక్కటే.
బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. స్నేహితులతో కలిసి ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మంచి స్నేహాన్ని మించిన ఆస్తి లేదంటారు. మనిషికి ఎంత డబ్బున్న బాధలో ఉన్నప్పుడు సంతృప్తిని ఇవ్వలేవు, అదే ఒక మంచి స్నేహితుడు ఉంటే నీ బాధలన్నీ మరిపించి బాల్యాన్ని గుర్తు చేస్తూ బాధను మరిపించే ప్రయత్నం చేస్తాడు (స్నేహితుడు).
మన జీవితంలో లక్షల, కోట్ల కన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించటం ఎంతో అవసరం. స్నేహానికి ఎల్లలు, కులం, మతలుండవు. ఎటువంటి సమస్యనైనా స్నేహితుడితో పొరపొచ్చాలు లేకుండా చర్చించుకునే అవకాశం ఒక స్నేహితుడి దగ్గర ఉంటుంది. అహానికి స్నేహం దగ్గర చోటే ఉండదనడంలో అతిశయోక్తి లేదు. స్నేహంలో ఎక్కువ తక్కువ లుండవు. పేదవాడు గొప్ప ధనవంతునితో స్నేహంతో కలుపవచ్చు. మనం బాల్యంలో చేసిన అల్లరి అప్పుడప్పుడు గుర్తుచేసే మంచి హాస్యనటుడు కూడా స్నేహితుడే.
అప్పుడప్పుడు నేను స్కూల్లో స్నేహితులతో గడిపిన సంఘటనలన్నీ గుర్తుచేసుకొని నాకు నేను ఆనందిస్తాను అది తీపి జ్ఞాపకం. ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత స్నేహితుడు కనిపించిన క్షణం అపురూపంగా, ఆప్యాయతంగా పలకరిస్తే గతంలో మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది
తెలిసీ తెలియక క్లాసురూం లో చేసిన అల్లరి గుర్తుచేసుకుంటూ నవ్వుకునే సందర్భం ఎంత హాయినిస్తుందో.
ఆ రోజుల్లో స్నేహితులతో ఆడుకున్న ఆటలు నేటికీ మదిలో పదిలం.
ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.
* ఖాళీ అగ్గిపెట్టెలను చించి స్నేహితులతో కలిసి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.
* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది.
*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.
* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వొంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడు మూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,
ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.
ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.
* వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం
ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.
* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో . ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటలతో చెప్పలేము అని అనుభవిస్తేగానీ స్నేహం తెలియదు.
* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం స్నేహితులతో కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.
* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.
* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.
కోట్లు పెట్టిన కొనలేని ఆనందాన్ని ఉచితంగా పొందే అవకాశం ఒక స్నేహానికి ఉంది.
దొరకని చోట స్నేహాన్ని వెతికే కన్నా దొరికిన చోట స్నేహాన్ని వదలకు మిత్రమా..
ప్రాణం ఉన్నంతవరకు మంచి స్నేహాన్ని మరువకు నేస్తమా!!
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్: 9391480475
28, ఆగస్టు 2022, ఆదివారం
మన బడి
24, ఆగస్టు 2022, బుధవారం
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
అక్షరం, కలం విలువలు ప్రసాదించే గురువు ఈ రెండింటికన్నా గొప్పవాడు. ఎందుకంటే గురువులేనిది అక్షరం లేదు. అక్షరం లేనిదే కలం లేదు.
గురువు అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేవాడు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే. దానికి ఆధారం గురువు.
దేశ భవిష్యత్తు
నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది - కీర్తించదగినది. ఆచార్యదేవోభవ అన్నారు
తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదే . తల్లిదండ్రులు జన్మనిస్తే. గురువులు ఆ జన్మని సార్ధకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. అవి మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి మరియు ఎదగడానికి సహాయపడతాయి - మనం ఎదగాలని వారు కోరుకుంటారు.
గురువు స్థానం ఎంత గొప్పదంటే ఒక ఇంజనీర్ మరొక ఇంజనీరుని చేస్తాడేమో, ఒక డాక్టర్ ఇంకాకొంతమంది డాక్టర్స్ ని చేస్తాడేమో కానీ ఒక టీచర్ మాత్రమే ఎంతో మంది డాక్టర్లని మరెంతో మంది ఇంజనీర్లని, ఇంక వివిధ రంగాలలో ఉన్నతమైన స్థానానికి చేర్చగలడు, ఉపాధ్యాయుల వల్లే మంచి వ్యక్తులు (ప్రముఖులు) తయారువుతారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం..
గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది.
అర్జునుడిని
అత్యుత్తమ మేటి విలుకాడిని చేయ ప్రతినభూని తన ప్రతిజ్ఞ నెరవేరడానికి తన
ప్రతిమను మాత్రమే పూజించి అపూర్వమైన విలువిద్య పొందిన ఏకలవ్యుడి కుడి బొటన
వేలిని గురు దక్షిణగా స్వీకరించి ఏకలవ్యుడి ప్రతిభను అనగదొక్కిన
ద్రోణాచార్యుల సంఘటన మహాభారతంలో ఎంతవరకు నిజమో కల్పితమో కానీ ఇప్పటికీ
గురు స్థానం మారలేదు ఎందుకంటే గురు లక్ష్యం మారలేదు గురువుకు పర్యాయపదంగా
ద్రోణుడి పేరును ఉటంకిస్తాము అందుకే అత్యుత్తమ గురువులను నేడు
ద్రోణాచార్య పురస్కారం చేత గౌరవిస్తున్నాము.
నిజమైన గురువు అంటే..
ఈమధ్య
కాలంలో జరిగిన యదార్ధ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలి జిల్లాలో
రాయ్‌ఘడ్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు శివేంద్ర సింగ్ అనే ఉపాద్యాయుడు
నాలుగేళ్ల క్రితం వచ్చారు.అప్పటినుండి విద్యార్థులకు శివేంద్ర సింగ్ చెప్పే
పాఠాలు మరియు నైతిక నిలువలు గురుంచి చెప్పేవారు. శివేంద్ర సింగ్ అంటే
ఎంతగానో ఇష్టపడేవారు. అందుకు ప్రతి విద్యార్థి తప్పని సరిగా ఆయన క్లాస్‌కు
వెళ్లేవారు. శివేంద్ర సింగ్ ప్రభుత్వం వేరే స్కూల్ కి బదిలీ చేసింది.
బదిలీపై వెళ్తున్న సమయంలో చాలా మంది విద్యార్థులు అతనిని కౌగిలించుకుని
ఏడ్చేశారు. కొంతమంది విద్యార్థులు అతనిని గట్టిగా పట్టుకుని.. ప్లీజ్ సార్
వెళ్లొద్దంటూ బతిమాలుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో
బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను, ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం
ఉద్వేగానికి గురియైనారు. విద్యార్థులపట్ల స్నేహభావంతో ప్రేమానురాగాలను
పంచుతు వారికీ విలువైన విద్యనందిచిన గురువు పట్ల విద్యార్థుల భాధ
వర్ణణాతీతం. నిజమైన గురువు అంటే శివేంద్ర సింగ్ లాగా ఉండాలి .
ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రవేట్ వివిధ రంగాలలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులు, ప్రతిఒక్కరం గురువులకు శిష్యులమే.
అందుకే
ఏస్థాయికి ఎదిగిన మనకు విద్యనందిచిన ఉపాధ్యాయులను మరువకూడదు. సంవత్సరానికి
ఒకసారైనా మన ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటూ వారికీ ఉపాధ్యాయ దినోత్సవం
శుభాకాంక్షలు తెలియజేద్దాం..
నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా.. రాబోవు తరం
దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ..
గురువులందరికీ వందనం.. అభివందనం.
మీ
కోట దామోదర్
మొబైల్: 9391480475
23, ఆగస్టు 2022, మంగళవారం
మాతృభాష
మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హింది కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.
21, ఆగస్టు 2022, ఆదివారం
ఆశ్రమాలలో అమ్మనాన్నలు
15, ఆగస్టు 2022, సోమవారం
చిన్ననాటి జ్ఞాపకాలు
- ఆరోజుల్లో వారానికి ఒక సినిమా దూరదర్శన్ లో వచ్చేది.
- ఆరోజుల్లో కొంతమంది ఇళ్లలోనే రేడియో ఉండేది.
- ఇంటికి చుట్టాలొచ్చి
- ఎగురుతున్న విమానం
- జాతరలో కొన్న బొమ్మలను చూసుకొని మురిసే ఆనందం
- అన్నంలో చింత చిగురు ఒట్టి చాపల కూర
- కాలక్షేపానికి లోటే లేదు...
- చిన్నప్పుడు
ఆదర్శం కోల్పోయిన కళాశాల
= = = = = = == = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =
నేను పాలిటెక్నిక్ చదివిన కళాశాల పేరు "ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్" భద్రాచలం (ఎటపాక). ఈ కళాశాలలో చదివిన నాలాంటి పూర్వ విద్యార్థులందరికీ ఒక ఆదర్శనంగా నిలిచింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ఎందరో ఉన్నత స్థాయిలలో ఎదిగారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో అన్నిపాలిటెక్నిక్ కళాశాలల్లోకెల్లా అత్యధికంగా విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కళాశాలదే. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కళాశాల ఇప్పుడు శిథిలావస్థ కి చేరుకుంది. మరో బాధాకరమైన విషయం ఒకప్పుడు తెలంగాణాలో ఉన్న ఈ కళాశాల తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రవిభజన సందర్భంలో ఈ కళాశాల ఆంధ్ర రాష్ట్రము వారికీ పరిగణించబడింది. విభజనకు ముందు ఈ కళాశాలలో సీట్ దొరకక చాలామంది నిరుపేద విద్యార్థులు భాధపడేవాళ్లు అలాంటిది రాష్ట్ర విభజన తదనంతరం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల అధ్యాపకుల కొరత మరియు విద్యార్థుల కొరతవల్ల కళాశాల మూతబడింది.ఈ విషయం తెలియక ఈమధ్య భద్రాచలం వెళ్ళినపుడు కళాశాలని చూడాలనిపించి వెళ్ళాను. అక్కడవున్న పరిస్థితులను చూసి చాల భాధ అనిపించింది. ఎందుకంటే మూడు సంవత్సరాలు హాస్టల్ మరియు తిండి, చదువుతోపాటు అన్నివసతులు కల్పించి నన్ను ఈ స్థాయికి చేర్చిన కళాశాల మూతబడిందన్న విషయం జీర్ణించుకోలేక బాధపడిన సందర్భం అది. నేనున్నాహాస్టల్ గదికి వెళ్లిన అప్పుడు నాకు పాతకాలం జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి నన్నునేనే మరిచిన సందర్భం. అది ఒక తీపి జ్ఞాపకం లాటింది. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే నా ప్రాణ స్నేహితుడైన (ప్రభు కుమార్) నేను కలిసివెళ్లడం. నాకు అత్యంత సంతోషకరమైన విషయం. మా స్నేహం అల అల్లుకుంది. మేమిద్దరం కలిసి పాతకాల సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటూ సరదాగా గడిపిన సందర్భంలో మా ఫోన్లో ఫొటోస్ తీసుకొని చాలాసేపు అక్కడే గడిపాము. ఆ క్రమంలో మాకొచ్చిన జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి..
* మొదటగా కళాశాల్లో జాయిన్ అవ్వాలంటే ఒకరకమైన ర్యాగింగ్ భయం ఉండేది. అది ఒక మొదటి సంవత్సరం వరకే. అలా ఒకసంవత్సరం గడిచిన తరువాత మేము నేర్చుకున్న పాఠం: సీనియర్స్ ని గౌరవించాలి, కలిసినపుడు నమస్తే పెట్టాలి, సీనియర్స్ ఏదైనా సహాయం కోరితే తప్పకుండ చేయాలి అన్నదే ర్యాగింగ్ అర్ధం అంతే తప్ప అంత్యంగా బాధించే సంఘటనలు ఏమి ఉండేవి కాదు..
* కొంత మంది సీనియర్స్ ర్యాగింగ్ సమయంలో వింత విచిత్రమైన ఆంక్షలు ప్రవేశపెట్టేది. అవేంటంటే "జనగనమన" ఒకరిని పాడమనేది ఇంకొకరిని డాన్స్ చేయమనేది. ఆ సమయంలో నాకు డాన్స్ రాక సీనియర్ల వితండవాదానికి అప్పుడు ఏడ్చినా సందర్భం అయితే ఇప్పుడు మాత్రం నవ్వుకునే సందర్భం.
* హాస్టల్ డైనింగ్ హాళ్లలో కూరలు రుచిలేక, సాంబారులో పురుగులు పడిన సందర్భంలో విద్యార్థుల ఆవేశం ఓ విలయతాండవం, వితండవాదం.
* హాస్టల్ పైన అందరం ఒకేదగ్గర ముచ్చటిస్తూ స్థానం చేసిన క్షణం అదొక తీపి జ్ఞాపకం..
* సినిమా చూడటానికి దగ్గర్లో థియేటర్స్ లేక ఇబ్బంది ఉన్నపటికీ సీనియర్స్ కొంతమంది అయిదు రూపాయలు తీసుకొని టీవీ హాల్లో సినిమాలు వేసేది. ఆ సినిమాలు చూసి ఎంతగానో ఆనందపడేవాళ్ళము. స్నేహితులమధ్య చూడటం అనేది నిజంగా అదొకరకమైన అనుభూతి.
* పరీక్షల సమయంలో టీ కోసం లైన్లో నిలబడి తాగిన సందర్భం, క్లాస్ ఎగ్గొట్టి పక్కన పరిసరప్రాంతాల (బొజ్జికుప్ప) పర్యవేక్షించిన సందర్భం ఓ మధురజ్ఞాపకాలే.
* హాస్టల్ లో ఉన్న స్నేహితులమంతా ఎంతబాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళమంటే అది మాటల్లో చెప్పలేనంత స్నేహబంధం. ప్రాణానికి ప్రాణం ఇచ్చేంత. ఆప్యాయత అనురాగాలు, ఆపదలో ఆపన్నహస్తాలు. మాకు ఏమైనా అయితే అక్కడ అమ్మానాన్న ఉండరుగాని వారులేని లోటు మా స్నేహితులు తీర్చేవారు అంతమంచి హాస్టల్ స్నేహబంధం నన్ను ఎంతగానో ఆకర్షించింది.
* నాకు కొన్ని సందర్భంలో హాస్టల్ ఫుడ్ పడక తినడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో నా ప్రాణ స్నేహితుడు ప్రభు కుమార్ ఆదుకున్న క్షణాలు నా జీవితంలో మరిచిపోలేనిది. అమ్మ సమానులైన ప్రభు అమ్మగారు (జాస్లిన్ గారు) నాకోసం సారపాక నుండి వాటర్, మధ్యాహ్నం భోజనం ప్రభుతో పంపించి నా ఆరోగ్యంపట్ల చదువుపట్ల శ్రద్ధ చూపిన జాస్లిన్ అమ్మగారికి పాదాభివందమ్.
* సాయంకాలం స్నేహితులతో శ్యామలరావు గుడిసెలో టీ తాగిన సందర్భాలు జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకం.
* నా మిత్రుడు హాస్యపండితుడు బోడపాటి ఆనంద్ మా అందరిని ఎంతగానో నవించి నవ్వుతు కాలక్షేపం చేసేవాడు. నిజానికి ఆనంద్ లాంటివాళ్లు కూడా ఉండాలి ప్రతి బ్యాచ్లో.
* కష్టాలలో, సుఖాలలో తోడుగా నీడగా ఉండే స్నేహబంధాన్ని అందించిన ఈ ఆదర్శ కళాశాలని అందరూ ఆదర్శనంగా తీసుకోవాలని కోరుకుంటున్న.
మా కళాశాల అధ్యాపకులు చెప్పే విధానం ఒక అద్భుతం. st మైనార్టీ కళాశాల అయినందున ఎక్కువగా తండాలనుండి, గ్రామాలనుండి వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. పాలిటెక్నిక్ సబ్జక్ట్స్ అన్ని ఇంగ్లీషులోనే ఉండేవి కాబట్టి ప్రతిఒక్కరికి అర్ధమయేరీతిలో బోధించేవారు. నిజానికి వారికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతోమంచి పేరున్న ఈ కళాశాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల మూతపడేస్తాయికి చేరుకుందంటే నిజంగా అత్యంత బాధాకరమైన విషయం.
దయచేసి ఆంధ్ర ప్రభుత్వం ఈ కళాశాల మూతపడకుండా యధావిధంగా కొనసాగించటానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా కోరుకుంటున్న..
✍️
మీ
కోట దామోదర్
మొబైల్: 9391480475
6, ఆగస్టు 2022, శనివారం
అండలేని "చేనేత" జెండా !
ప్రాచీన సంప్రదాయాలన్ని అంతరించిపోతున్నప్పటికీ తన సంప్రదాయ వారసత్వ వృత్తిని, కళను కాపాడుకుంటు వస్తున్న నేతన్న, కళ తప్పిపోయిన బతుకీడుస్తున్నాడు. మొదటినుండి ఎందరో నేతలు చేనేత గొప్పదని ఒప్పుకొంటున్నారే గాని నేతన్నజీవితాలు మెరుగు పరిచే బాధ్యత నుండి తప్పుకుంటున్నారు. మూడు పూటలు కష్టపడే నేతన్న తన బిడ్డలకు ఒక్క పూట కూడా కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలోనే దాదాపు స్వాతంత్ర్య ఆనంతరం కుటుంబాలను వదిలి నేతన్నలు పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలోని షోలాపూర్, బిమండి, బొంబాయి నగరాలు కూడా దాటి గుజారాత్ రాష్ట్రంలోని సూరత్, అహ్మదాబాద్ పట్టణాలలో బట్టల మిల్లులలో రోజుకు పన్నెండు గంటలకు మించి పనిచేసి ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. పిల్లలను చదివించడానికి స్తోమత లేక అదే పనిలో కొనసాగిస్తున్న కుటుంబాలెన్నో. ఎప్పటి నుండైతే వీరి వలసలు కొనసాగినాయొ పల్లెటూళ్ళలో మగ్గం శబ్దాలతో లయ బద్దంగా నాట్యమాడిన నేతన్నల వీధులు అప్పటి నుండే నిశ్శబ్ధంగా రోధిస్తున్నాయి. అటు తర్వాత జరిగిన పరిణామమే కొంత మంది నేతన్నలు అప్పులు చేసి మర మగ్గాలను తెప్పించుకున్నారు. కానీ వారికి ముడి సరుకు అందుబాటులో లేదు, వున్నా కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితులలో చేసిన అప్పులు తీర్చలేక తమ కుటుంబాల ఆకలి బాధ నుండి చూడలేక చాలా మంది నేతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారు.
ఇంకా మర మగ్గం మీద నేసిన సరుకు సరియైన మార్కెటింగ్ సదుపాయాలు లేక, గిట్టుబాటు ధరలేక తప్పనిసరి పరిస్థితులలో మధ్య ధలారీల దోపిడికి గురు అయి మర మగ్గానికి కూడా దూరంకావలిసిన దుస్థితి ఏర్పడింది. మన చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నపటికీ మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్తానం ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. మొదటగా ఇక్కత్ వస్త్రాలు నేసిన పోచంపల్లి నేతకార్మికులు వారి కళానైపుణ్యాన్ని తెలంగాణలోని పలు జిల్లాలోని గ్రామాలకు వ్యాపింపజేయటం చేనేతకు కొంత అండగా నిలిచింది. ఇక్కత్ వస్త్రాలు తెలంగాణ నుండి పలు విదేశాలు ఎగుమతి చేస్తున్నారు అంటే మన చేనేత కార్మికుడి కళానైపుణ్యం ఎలాంటిదో నేరుగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా నేతన్న కల చెదిరినట్లయింది. అనేక నేత పరిశ్రమలు మూతపడటం వలన వృత్తినే నమ్ముకున్న నేతన్న వేరే పనిచేయలేక సతమతపడుతున్నాడు, చావుకైనా సిద్ధపడుతున్నాడు.
అయినా తన వృత్తిని కాపాడటంకోసం నేతన్న అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి కనుక కొనసాగితే భారత దేశానికి గర్వకారణమైన చేనేత కళాసంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదమున్నది. ప్రస్తుతం పెరు గుతున్న పెట్టుబడి వ్యయం, తగిపోతున్న అమ్మకాలు ఇలా ఎన్నో కారణాలచేత చేనేత రంగం ఇబ్బందులు పడుతున్నాయి మన చేనేత కుటుంబాలు. రోజురోజుకి నేతన్నల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
అగ్గిపెట్టలో పటేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుడి జీవితం దుర్భరంగా మారకుండా ఇకనైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిస్కారం చేయాలని కోరుకుంటున్న.
✍️
కోట దామోదర్
మొబైల్: 9391480475
7, మే 2022, శనివారం
రాశా మొదటి 'అ' నే అమ్మగా.
కమ్మనైన అమ్మ జోల పాట ఎంతమధురమో
పసిపాపల కనులనిదురలలో కనిపించని దేవత అమ్మ.
అమ్మ...! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో... ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. ఉహకందనిదే అమ్మప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా.
అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం. ఈరోజుల్లో అమ్మానాన్నల మీద ఆప్యాయత చూపకుండ
ఆస్తులమీద మమకారంతో అమ్మానాన్నలన దూరంపెడుతున్న నేటి సమాజం వాట్సాప్ స్టేటస్ వరకే పరిమితం.
బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు.. కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్నా అని అనం.. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత
మీ
కోట దామోదర్
26, ఏప్రిల్ 2022, మంగళవారం
ఆరోగ్య సంపద
ఆరోగ్య సంపద
= = = = = = = = =
అసలైన సంపద అంటే ఆరోగ్యంగా ఉండడమే అంటారు. ప్రశాంత చిత్తం కలిగిన వారు సుఖ నిద్ర పొందుతారు. అంతకన్నా ఆస్తి ఏమి ఉంటుంది?. మనం ఆరోగ్యాన్ని సంపాదించకుండా, ఆస్తులని సంపాదిస్తున్నాం, అనారోగ్యపాలవుతున్నాం
ప్రతిఒక్క మానవుడు ఆరోగ్యముగా ఉండాలి కోరుకుంటారు కానీ ఏ ఒక్కరు కూడా ఆరోగ్యముగా ఉండడానికి కావలిసిన నియమాలను పాటించారు ఎవరైతే పాటిస్తారో వారే ఆరోగ్యముగా ఉంటారు అది చాల తక్కువ అనే చెప్పొచ్చు ...
ఆరోజుల్లో ఏ టెక్నాలజీ లేకున్నా మంచి ఆహారం తీసుకొని 90 ఏళ్ళు పైగా బతికినవాళ్లు 80% మంది.
ఇప్పటివాళ్ళకి టెక్నాలజీ ఎక్కువై మంచి ఆహారం కొరత ఎక్కువైంది దానివలన 90 ఏళ్ళు బతికేవాళ్ళము ఎప్పుడు పోతామో అయోమయంలో ఉంది జీవితం. దీనికి కారణం మనమే...
ఎలా అంటే ....
1. ఆరోజుల్లో పొద్దున్న లేవగానే పళ్ళు తోమడానికి వేప పుల్ల వేసుకునేది. పళ్ళ రోగాలు లేవు..
మనం లేవగానే కెమికల్తోతయారైన పేస్ట్ ని వాడుతున్నాం. చిన్నతనం నుండే పంటి నొప్పులు వాటికీ చికిత్సలు.
2. అప్పటివాళ్ళు టీ తయారీకి స్వచ్ఛమైన గేదె పాలను వాడేవారు. మనం కెమికల్తో తయారైన పాలను వాడుతున్నాం..
3. ఆరోజుల్లో టిఫిన్ చేయటం చాల తక్కువ మూడు పూటలు అన్నం తినేవాళ్లు. స్వయంగా పండించిన ధాన్యంతో మరియు కూరగాయలతో స్వచ్ఛమైన నూనెతో వంట వండుకొని తినేవాళ్లు.
మనం తినే టిఫిన్ మరియు అన్నం అన్ని కూడా కెమికల్ ఉపయోగించి పండించినవే అంతేకాదు వంటనూనెలు కూడా దేనితో తయారుచేస్తున్నారో తెలియని ప్రశ్నగా మారింది..
4. ఆరోజుల్లో వ్యాయామం చేసేవాళ్ళేకాదు అయినా ఆరోగ్యాంగా ఉండే వాళ్ళు .. ఇప్పుడు వ్యాయామం చేసేవాళ్ళు తక్కువే ఆరోగ్యాంగా ఉండేవాళ్ళు కూడా తక్కువే. కారణం మనం సుఖమైనా జీతానికి అలవాటు పడటం, నాణ్యమైన ఆహారం దొరకకపోవడం. ఇవన్నీ తెలియాక మనం అనారోగ్యాంగా ఉన్నపుడు డాక్టర్ దగ్గరకి వెళ్లి అయన రాసిన మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతాం అది మన తెలివి ..
a. మనం పదిసార్ల వాడిన నూనెలో వేయించిన అప్పడాలు, వడలు, సమోసాలు వదలకుండా తింటాం అయినా ఏమి కాదు అనుకుంటాం...
b. రోడ్డుపక్కన చెత్త నీటితో తయారైన పానీపూరి లొట్టలేసుకుని తింటాం అయినా ఏమి కాదు అనుకుంటాం ..
c. అన్నిరకాల మందు తాగుతాం అందులో ఏమి కలిసిన మనకు ఏమి కాదు అనుకుంటాం..
మనలని రక్షించే డాక్టర్ దగ్గరకి వెళ్లి ఆయన్నే పరీక్షితం...
అయినా డాక్టర్ చెప్పినట్లు వినం అయినా ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చుపెడతాం. కోట్లు ఇచ్చిన మన అనారోగ్యాన్ని ఎదుటివారు తీసుకోరు అని తెలిసిన ఆరోగ్య సంపదను మరిచి ధన సంపదే కావాలనుకుంటాం..
ఆరోగ్యమే మహాభాగ్యం అని పలకటం సులభమే కానీ దాన్ని ఆచరణలో పెట్టాం.. దాన్ని అర్ధం చేసుకొనే లోపే మన జీవితం అయిపోతుంది..
భగవంతుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదంలో ఏముందోఏమోగాని అది అర్ధం కాదు..
మీ
కోట దామోదర్
మొబైల్ : 9391480475
23, ఏప్రిల్ 2022, శనివారం
తాటికల్లు
✍
మా ఊరి జ్ఞాపకాలు
మా ఊరు గుమ్మడవెల్లి. ఊరు చుట్టూ చూడచక్కని పచ్చని పంటపొలాలు. ఊరినడుమ ఊట బావులు, ఊరి చివరన చెలిమ భావి. ఊరి నట్టనడుమ రాములవారి గుడి, చిట్ట చివరణ ముత్యాలమ్మ గుడి, ఊరి మొదట పెద్ద బడి, ఊరి నడుమ చిన్న బడి, ఐక్యమత్యంతో మెలిగే ఊరి జనం, పండుగ సంబరాల కోలాహలం. నా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. జన్మనిచ్చిన తల్లి, పుట్టిన ఊరు ఎవరికైనా ప్రత్యేకమే. ఈ రెండూ ఎవరికైనా గొప్పవే. మనం పుట్టిన ఊరు, బాల్యం అంతా గడిపిన ఊరు, జ్ఞాపకాలు అన్నీ మనకు ప్రత్యేకమే అనడంలో సందేహం లేదు.
నా చదువు అంతా మా ఊరి పాఠశాలలోనే కొనసాగింది. నా చిన్నప్పటి కొన్ని జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి. ఏది ఏమైనా మన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు, సంఘటనలను నెమరు వేసుకోవడం, ఆనందించడం సహజం. ఇది భగవంతుడు మనకు అందించిన అద్భుతమైన జ్ఞాపకం. అందుకే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు. జన్మనిచ్చిన తల్లిని మనం మరచి పోలేము. అలాగే ఊరిని కూడా మరువలేము.
కనుమరుగౌతున్న ఆటలు:
మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పుల ప్రక్రియలో, కొన్ని విషయాలు అదృశ్యం కావడం మరియు వాటి స్థానంలో కొత్తవి ఆవిష్కృతం కావడం సహజం.
ఆనాటి ఆటలు పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో ఆరోగ్యానికి మేలు చేసేవి. కాలం గడిచేకొద్దీ పాత ఆటలు అంతరించిపోయి వాటి స్థానంలో కొత్త కంప్యూటర్ సంబంధిత గేమ్స్ పిల్లలపై చెడు ప్రభావం చూపడం విచారకరం. ఇప్పటి తరానికి అప్పటి ఆటలు తెలియకపోవడం బాధాకరం.
ఆ రోజుల్లో ఆదివారం అంటే మాకు ఆటల పండుగ. నేను ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.
* ఖాళీ అగ్గిపెట్టెలను చించి పత్తాలాట ఆడిన సందర్భాలు ఓ మధుర జ్ఞాపకం.
* ఖాళీ సారా ప్యాకెట్లను బంతిలాగా తయారుచేసి పుచ్చి బంతి ఆట ఆడిన క్షణం ఎంత సంతోషాన్నిచ్చేదో మాటల్లో చెప్పలేనిది, ఆ సంతోషం వెల కట్టలేనిది.
*వడ్ల శేషయ్య ఇంటిదగ్గర సందులో స్నేహితులతో కలిసి ఆడిన గోళీలాట ఎంతో సంతోషాన్నిచ్చేది.
* జిల్లగోన ఆట, చింతగింజలతో దాడి ఆట, కోకో , కబడ్డీ , తొక్కుడుబిళ్ల , పిక్కలాట , వంగుడు దూకుడు, ముక్కు గీసుడు, దాగుడుమూతలు, దొంగ పోలీస్, దూకుడు పుల్ల, ఉప్పు బేర, తాడట, తుడువు, పైసల్ కమ్ముడు, పైసలట, నీడలు తొక్కుడు, కూరంట బువ్వంట,
ఇలా ఎన్నో ఆటలు స్నేహితులతో కలిసి ఆడుకున్న సందర్భాలు అతి మధుర జ్ఞాపకాలు.
ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వారు టీవీలు, మొబైల్ తో కాలక్షేపం చేస్తున్నారు తప్ప స్నేహితులతో గడిపే వారు లేరు.
* వేసవి కాలం వచ్చిందంటే స్నేహితులంతా కలిసి బావుల్లో ఈతకు వెళ్ళేవాళ్ళం
ఆ రోజుల్లో ఊరిలో బంధం బావి, చింతల బావి, మంగలి నారాయణ బావి, నర్సింహారెడ్డి బావి ఉండేవి. ఈ బావిలాల్లో ఈత కొట్టి ఎండాకాలం మొత్తం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అంత ఆనందం రాదు. నాకు మా అన్నయ్యలకు ఈత నేర్పిన గురువులు ఆకారపు వీరయ్య, చాకలి సొక్కయ్య చాలా మంచి వ్యక్తులు మరియు మా నాన్నకు మంచి స్నేహితులు - సన్నిహితులు కూడా.
* కొన్ని సందర్భాలలో రేగుపళ్ళ కోసం , మామిడి పళ్ళ కోసం బావిలకడ తిరిగిన రోజులెన్నో ...ఇంకా కొన్ని సందర్భాలలో దోస్తులతో కలిసి తుమ్మ చెట్లల్లో బంక తీసుకొచ్చి (మా శెట్టి కేదరీ) షాపులో ఇస్తే బెల్లం ఇచ్చేది అది తినుకుంటూ ఎంత సంతోషపడేదో మాటల్లో చెప్పలేము అని అనుభవిస్తే గానీ తెలియదు.
* ఈత పండ్ల కోసం , సీతాఫలకాయలకోసం కంచెలేమ్మటి చేన్ల ల తిరిగేది అప్పటి అనుభూతి ఓ ప్రపంచాన్నే తిరిగొచ్చాము అనేలా ఉండేది.
* శెనగకాయలు కాల్చుకొని తినేవాళ్ళము సీతాఫలాలు కూడా, ముంజ్జలకోసం గౌడల్లన్న తాళ్ల కాడికి పోయి తినేవాళ్ళం తాటి పళ్ళు వాటిలో ఉండే గేగులు తినేవాళ్ళం.
* రూపాయి ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకిచ్చేది బొలిశెట్టి భాస్కర్ క్రమేపి ఆకారపు ఎల్లయ్య (డబ్బా కొట్టు ఎల్లయ్య ) కూడా ఇచ్చేది. అల సైకిల్ అద్దెకి తీసుకొని సైకిల్ నేర్చుకున్న రోజులు అవి అప్పట్లో సైకిల్ తొక్కి ఊళ్ళో తిరిగితే బుల్లెట్ బండి మీద తిరిగినంత ఆనందం ఉండే.
* గుమ్మడవెల్లిలో ఎక్కడా లేనివిధంగా ప్రజల్లో ప్రేమ, ఆప్యాయతలు, సాయంత్రం వేళల్లో అందరూ ఇంటి ముందు కూర్చుని పలకరించుకుంటారు. బొడ్రాయి బజార్‌లో ఇప్పటికీ ఈ సంస్కృతి కొనసాగడం గర్వించదగ్గ విషయం.
* పక్కింటివారితోను, ఊరి జనాలతోను ప్రతిఒక్కరు స్నేహబందంగా మెలిగేవారు
ఈరోజుల్లో పక్కింటోడి పేరు తెల్వని మహానుభావులు ఎంతోమంది ఉన్నారు.
ఆ రోజుల్లో పక్కింటి ఆమె ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వాళ్ళు వచ్చి ఓదార్చే వాళ్ళు ఈ రోజుల్లో పక్కింటోడు ఉరి పెట్టుకున్న కాపాడే దిక్కులేదు, ఆ రోజులే బాగున్నాయి ..
* ఊరిలో ఒక నారాయరెడ్డి దొరకె టీవీ ఉండేది అప్పట్లో, తర్వాత క్రమేపి పోస్ట్ ఆఫీస్ సత్యనారాణ, రుద్ర మురళి, అమ్మగారింట్లో టీవీ వచ్చింది .
ఆదివారం ఒక సినిమా కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగాఉండేది మా మిత్ర బృందం, జనాలు కూడా నానా కష్టాలు పడేది అల సినిమా చూసి ఎంతగానో సంతోషించేది . కొందరైతే సినిమా చూసినపుడు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు: మాతృదేవోభవ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాధ పడనివారు ఏడవని వారు ఉండరు. అంత బాధాకరమైన సినిమా ఇప్పటికి చూడలేదు. అప్పటి సినిమాలు చూస్తుంటే ఆ పాత్రలో లీనమైయే స్వభావం ఉండేది కథకి (ఆ పాత్ర కి). అప్పటి సినిమాలకు ఖర్చు తక్కువ, కథ సారాంశం ఎక్కువ. ఇప్పటి సినిమాల్లో ఖర్చెక్కువ, కథ సారాంశం తక్కువ.
ఆదివారం సినిమా చూసిన మరుసటి రోజునుండి ఒక వారం రోజుల వరకు ఆ సినిమా ముచ్చట్లు మా మిత్ర బృందానికి.
మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసేది. ఇప్పుడు అందరిళ్ళలో టీవీలు రోజు సినిమాలు అయినా చూసే తీరిక లేదు .
* గుమ్మడవెల్లి లో ప్రజలు ప్రతి పండుగ చాలా ఘనంగా జరిపేవారు.
ముఖ్యమైనటువంటి పండుగలలో
* వినాయక చవితి అప్పట్లో దాబా సోమయ్య (అనబతుల సోమయ్య ) ఇంటి పక్కన స్టేజీమీద గణేషుడిని పెట్టి సాయంకాలం ప్రజలందరూ భక్తి శ్రద్దలతో, భజనలతో, VCD లతో సినిమాలు వేసేవారు అప్పుడు అక్కడ సినిమా చూడటం అంటే IMAX లో చూసినట్లే, గణేష్ నిమజ్జనం నాడు పిల్లలందరూ కేరింతలు, డాన్స్ లతో పవిత్రీకృతమైన భక్తితో ఆ దేవుడిని నిమజ్జనం మా ఊరి చెరువులో చేసేవాళ్ళం.
* శ్రీరామనవమి నాడు శ్రీరాముడి భక్తులైనటువంటి మాశెట్టి కేధరీ, రాధమ్మ, ఊరి నాయకులు తదితరులు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించేది.
శ్రీరామనవమికి రైతులు, ఎడ్లబండి ఉన్నవారు ఎడ్లని, బండిని ప్రశాంతగా, పరిశుభ్రతగా, పవిత్రీకృతంగా కడిగి కుంకుమ పసుపు లేదా ఇతరత్రమైన రంగులతో అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండి ఊరుచుట్టు తిప్పేవారు.లు ఎంతైనా ఆ రోజులు వేరు ఈ రోజుల్లో ఊరు చుట్టూ బెంజ్ కారులో తిరిగిన అంత ఆనందం రాదు .
* ఆరోజుల్లో సంవత్సరానికి ఒకసారి సాధనాసురులు వచ్చి వాళ్ళ ఆటని ప్రదర్శించేవారు ఆ ఆట ఒక పెద్ద మ్యాజిక్ షో లాగా ఉండేది ఊరు జనాలందరూ వచ్చి చూసి ఇది పెద్ద కనికట్టు మంత్రం అని గొప్పగా సాధనా సురుల ను పొగిడే ది.
అప్పటికిప్పటికీ ఊళ్ళో ఘనంగా జరుపుతున్న పీర్ల పండగ అంటే నాకు గమ్మత్తుగా అనిపించేది.
* సాయంకాలం గుండం చుట్టూ సరిగత్హు ఆట వింత వింత వేషాలతో గుండం చుట్టూ కట్టెలతో కాలుస్తూ డప్పు చప్పుళ్ళతో డాన్స్ వేసేవాళ్ళు ఆ సరిగత్హు చూడటానికి ఊరు జనం అర్ధరాత్రి వరకు చూసి ఆనందించేది. ఈ రోజుల్లో డాన్స్ వేసే ఓపిక లేకపోయే కూర్చొని చూసే తీరిక లేకపోయే.
* పీర్ల పండగ ఆఖరిరోజు బహు ప్రజ్ఞాశాలి, అనన్యప్రతిభ కలిగిన ఐతరాజు బుచ్చయ్య (కుక్కడం) బేతాళుడి వేషంతో అందరిని భయపెట్టేది,
నిజంగా చెప్పాలంటే అస్సలైన బేతాళుడు కూడా ఐతరాజు బుచ్చయ్య వేసిన వేషధారణ చూసి భయపడాల్సిందే.
అంత గంభీరంగా ఉండేది వేషం నోట్లో కత్తి ఒంటిమీద కోడి రక్తం చేతిలో వేపమండలు తాళ్లతో కట్టేసి పట్టిన ఆగని కోపంతో ముందుకు ఉరుకుతూ జనాలని బయపెట్టేవాడు జనాలందరూ తలుపు వేసుకొని కిటికీల నుండి చూసేవాళ్ళం. అంత గొప్ప నటుడు ఐతరాజు బుచ్చయ్య. బుచ్చయ్య చనిపోయిన వార్త అత్యంత బాధాకరమైన విషయం.
* పండుగలల్లో ఉట్ల పండగ కూడా గమ్ముతుగా ఉండేది. ఉట్టికొట్టిన తర్వాత ఒక పైప్ భూమిలో పాతి దానికి రేగడి మట్టి మరియు కలబంద పూసి పైకి ఎక్కే వాళ్ళు యాదవులు అప్పుడు కింద ఉన్న వాళ్లంతా పైకి నీళ్లు చల్లేది పైకి ఎక్కకుండా కిందకి జారడానికి అప్పుడు గంటల తరబడి జనాలు కేరింతలు ఆ ఎంజాయ్ చెప్పలేము.
* ఇక పెద్ద పండుగలల్లో దసరా పండుగ నాడు బతుకమ్మ పేర్చటానికి తంగేడు పువ్వులు, టేకు పువ్వుతో బతుకమ్మ పేర్చి ఆడపడుచులు కొత్త బట్టలు ధరించి ఊరు చివరన చెరువు కట్ట కాడ బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో జరుపుకొనేది, అక్కడ ఊరు జనం అంత టపాకాయలు కాలుస్తూ దోస్తులందరం కట్టమీదే కలిసేవాళ్ళం అప్పుడు మొబైల్స్ లేవు వాట్సాప్ లేవు ఎప్పుడైనా దోస్తులందరం కలవాలంటే ఒక దసరా పండుగకు కట్టమీద కలిసే వాళ్ళు. మరుసటి రోజు దసరా పండుగ ఉండేది ఆ రోజు జమ్మి చెట్టు కొమ్మ తెచ్చి స్కూల్ ఆవరణలో పెట్టి రాజారామ్ శాస్త్రి గారితో (అయ్యగారు) అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత జమ్మి ఆకు కోసం జనాలందరూ ఎగబడి తీసుకునేది. తర్వాత జనాలందరూ పాలపిట్టను చూసేది ఊరి చివరన.
* ఇక కామునిపున్నమి (కోలాల పండుగ) ఇంటింటికి కోలాలు పట్టుకొనిపోయి రింగ్ రింగ్ బిళ్ళ రూపాయి దండ, దండ కాదురా దామెర మొగ్గ , మొగ్గా కాదు రో మోదుగు నీడ, నీడ కాదురా నిమ్మల బాయి, బాయి కాదురా బచ్చలికూర అనే పాట పాడితే ఇంటింటికి బియ్యం ఇచ్చే వాళ్ళు ఏదో ఒక సహాయం చేసేవారు , చివరిరోజున కోలలన్నీకలిపి కాముని బండ దగ్గర కాలేసేది మరుసటి రోజు హోలీ పండుగ ఉండేది దోస్తులందరు కలిసి, కోలలు ఆడే సందర్భంలో కాగడాలు తయారుచేసి నైట్ టైం లో కోలంకాలే కొట్టం కాలే మోడెమ్ ముత్తయ్య - - - కాలే అనే పాట పాడుతూ కాగడాలు తిప్పేవాళ్ళం ఆనాటి సంస్కృతి ఈనాడు జనాలకి గుర్తే లేకపోయే.
* ఈకాగడాలు తిప్పేవాళ్ళం దానికి చాల పెద్ద కథ ఉండే, మనం పేరే మర్చిపోయిన కథ గుర్తున్నదా ?
* ఎడ్లబండి చక్రాలలో నల్లని బండీఅందేం తో అందరికి పూసి ఎంతో ఆనందంతో అందరం కలిసి మంగలి నారాయణ భావికాడ స్థానం చేసేవాళ్ళం అల హోలీ పండుగ జరుపుకొనేది అది ఈనాటికి ఉన్నపటికీ అప్పట్లో ఉన్నంత ఆనందం లేదు.
* ప్రతి ఏటా ఒక్కసారి దృష్టశక్తులు ఊళ్లోకి రాకుండా ఊరు జనాల ఆరోగ్యాంగా ఉండడానికి బోనాల పండుగ అందరూ భక్తితో జరుపుకునేది ప్రతి ఒక్కరు ముత్యాలమ్మ గుడి దగ్గర కోడిని కోసుకొని వచ్చేది బోనం చెల్లించి. ఇంకా శివరాత్రి, ఉగాది, రాఖి , ఇలా అన్ని పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకొనేది.
* కులాల అతీతంగా కొన్ని పండగలు ఉండేవి యాదవులకు గంగదేవమ్మ పండుగ,
గౌడన్నలకు కాటమయ్య పండుగ,
sc కాలనీ వాళ్ళకి సవర్లచ్చమ్మ పండుగ,
* వనభోజనాలు నారాయణరెడ్డి దొర మామిడి తోటలో పద్మశాలీయులు అన్ని కుటుంబాలు కలిసి వనభోజనాలు గొప్పగా జరుపుకునేది అల అన్ని కులాల వాళ్ళు అనుకూల ప్రాంతాల్లో వనభోజనాలు జరుపుకునేది అది ఒక మంచి సంప్రదాయం అది ఈనాటికి కనుమరుగైనది అని చెప్పొచ్చు .
అప్పట్లో అన్ని కుటుంబాలు కలిసి తినేది ఇప్పుడు ఒక్క కుటుంబంలోనే కలిసి తినలేని అహంకారాలు పెరిగి తనకుతానే గొప్ప అనుకునే రోజులు వచ్చాయి ...
* అప్పుడప్పుడు సర్కస్ ఆటలు అందులో ట్యూబలైట్లు నమిలితినటం, భూమిలోపట జీవసమాధి అవ్వటం ఇలా ఎన్నో అద్భుతమైన విన్యాసాలతో ప్రదర్శనలు ఇచ్చేవారు ఈ రోజుల్లో అవి అంతరించాయి.
*రికార్డింగ్ డాన్సులు కూడా అంతరించాయనే చెప్పొచ్చు , బుర్ర కథలు, హరికథలు ఊరిలో అప్పటి బుర్రకథ కళాకారులూ
ముత్యం వెంకటయ్య,
దూదేకుల అంజయ్య,
దూదేకుల షర్బద్దిన్ తదితరులు ఉండేవారు.
* దొర గడీల పరదా సినిమాలు (లంకేశ్వరుడు, ఖైదీ, ఠింగురంగడు, ది జెంటిల్‌మన్ ) దోస్తులతో కలిసి చూసినపుడు మాలో ఆనందానికి అవధులు లేనట్లుండె అయిదు రూపాయలకి అంత మంచి సినిమా చూశామా అన్నట్లుండే,
ఇప్పుడు అయిదువందలు పెట్టిన అందులో అసలైన స్టోరీ లేకపాయె అస్సలైన ఫైట్స్ లేకపోయే..
అప్పటి పాటలు ఎంత అర్ధవంతంగా, వినసొంపుగా ఉండేవి.
* ఎండాకాలం ప్రతి ఏటా ఊరు చెరువులో ఊరిజనం చేపలు పట్టేవారు నీళ్లలో చేపలు పట్టే క్షణం అంతులేని ఆనందం ఏదో సముద్రంలో తిమింగలం పట్టినట్లు ఆనందం.
* ఆ రోజుల్లో బోరునీళ్ళు లేక ఊట బావిలాల్లో బకెట్ చేంతాడుతో చేదుకొని నీళ్లు వాడే వాళ్ళం దానివల్ల వ్యాయామం చేయవలిసిన పని లేకుండా, ఈ రోజుల్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ నీళ్ల ట్యాప్ ఒంటినిండా రోగాలు. మాకు దగ్గరలో తీగల వారి బావి ఉండే అదేమాకు దాహాన్ని తీర్చింది .. అత్యవసరాలకు, నిత్యావసరాలకు ఆ బావి నీరు వాడేవాళ్ళం..ఊరు లో అప్పట్లో తాగునీరు అందించే బావులు ఎలమంచిలి బావి, మెతుకు లచ్చమ్మ బావి, ఆంజనేయ గుడి బావి, చెరువు దగ్గర చెలిమ బావి, మోడెమ్ ఉప్పలయ్య ఇంటి దగ్గర షేర్ బావి, మేరోళ్ల బావి, బస్టాండ్ దగ్గర బోరింగ్ , ఎరుకల వారి బోరింగ్ అల చాలా ఉండేవి.
* అప్పట్లో ఊరి దగ్గర హాస్పిటల్ తక్కువ అయినప్పటికీ అత్యునత వైద్యసేవలంచినా ప్రముఖ వైద్యుడు స్వర్గీయ RMP DR. అడ్డ గట్ల ఆగయ్య, పెన్సిలిన్ మందు గురించి మొదటగా ఆయన దగ్గర విన్న నేను మా కుటుంబానికి వైద్యసేవలందించిన మహానుభావుడు. క్రమేపి బొలిశెట్టి బిక్షం, రవి డాక్టర్ ఇంకొంత మంది ఇప్పటికి వైద్య సేవలు అందిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
* అప్పట్లో పెళ్లి ఊరేగింపులు వాహనాలు లేవు వధూవరులను పల్లకిలో ఊరేగించేవారు ఆ పల్లకిని చాలా మంది స్వయంగా మోసేవారు. అదొక మధురమైన జ్ఞాపకం
అల చాలా వినోదకరమైన ఆటలతో ఉత్సహంతో ఉరకలేస్తూ నా బాల్యం గడిచింది .. మీరు కూడా మీ పిల్లలకి మీ బాల్యాన్ని వివరించి రాబోయే తరాలకు మన బాల్యాన్ని గుర్తుచేయగలని కోరుకుంటున్న
నేను చిన్న బడి లో చదివేటప్పుడు నా గురువులు
వరిపెల్లి యాకయ్య సార్ ,గోపయ్య సార్ , లక్ష్మయ్య సార్ , కృష్ణారెడ్డి సార్ , జగ్గయ్య సార్ ,
నాకు గుర్తున్న సార్ పేర్లు ఇవి , ఏమైనా మరిచిపోయింటే గుర్తు చేయగలరని కోరుకుంటున్నాను
వరిపెల్లి యాకయ్య సార్ చెప్పే పాటలు చాలా వినసొంపుగా ఉండేవి సార్ బోర్డు మీద గీసే బొమ్మలు చాలా అద్భుతంగా ఉండేవి సార్ గీసిన బొమ్మల సహాయంతో పిల్లలకి పాటలు అర్ధమవ్వటమే గాక మరిచిపోలేని స్థాయికి చేరుకునేది.
గోపయ్య సార్ పలకమీద పెట్టించిన అ, ఆ, . . దిద్దించి పైతరగతులకు పంపించిన మంచి గురువు .
చదువుతో పాటు ఆటలతో కూడా విద్యార్థులని ప్రోత్సహించారు.
అప్పుడున్న అటెండర్ ఐతరాజు హనుమంతు తులిశేరు బరిగెలు తెచ్చేది పిల్లలకు చదువు రాకపోతే కొట్టమని అప్పుడు అల కొట్టేది కాబట్టే హనుమంతు గుర్తుండు, మా భవిష్యత్తు కోసం బరిగెలు తెచ్చేది హనుమంతు.
బ్రేక్ టైం లో కొత్తగూడెం మల్లయ్య ఐస్క్రీమ్ అప్పుడప్పుడు తిని ఆనంద పడేవాళ్ళం , ఆ రోజుల్లో ఆ ఐస్ క్రీం తింటే ఆ ఆనందమే వేరు .
మధుర స్మృతులు:
అప్పట్లో మా ఊరికి (గుమ్మడవెల్లి) ఒకేఒక బస్సు వస్తుండేది. అది సూర్యాపేట నుండి రాత్రి 10.30 వచ్చి పొద్దున్నే 5.30 కి మళ్ళీ సూర్యాపేట కి వెళ్ళేది.
అప్పట్లో బస్సు లో ప్రయాణం అంటే అంతులేని ఆనందం ఇప్పట్లో విమానంలో ప్రయాణం చేసిన దొరకని ఆనందం అప్పట్లో దొరికేది ఇప్పట్లో అంత ఆనందం అనిపించటంలేదో అంతుచిక్కని రహస్యం..
ఎప్పుడైనా అమ్మనాన్న ఊరెళ్ళి వస్తున్నారంటే రాత్రి ఆ బస్సు ఎప్పుడొస్తుందో అని ఎదురుచూసేవాళ్ళం అమ్మనాన్న తెచ్చే అరటిపళ్లకోసం, అంగుర పళ్లకోసం అవి తిని ఎంతగానో ఆనందపడేవాళ్ళం.
ఆరోజుల్లో వారానికి ఒక సినిమా దూరదర్శన్ లో వచ్చేది.
ఆ సినిమా చూసి ఇంటికొచ్చాకా
ఒక గంటవరకూ ఆ సినిమా కబుర్లే.
మర్నాడు స్కూల్ లో కూడా...
ఆ ఆనందం ఇంకో పది రోజులుండేది..
ఆరోజుల్లో కొంతమంది ఇళ్లలోనే రేడియో ఉండేది.
ఆ రేడియో పాటల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సందర్భాలెన్నో..
అందులో పాటలు ఎలా వస్తాయో ఆశ్చర్యంగా..అమాయకంగా రేడియో ని తదేకంగా చూసి మురిసిపోయేవాళ్ళం. ఆదివారం నాడు రేడియో లో వచ్చే పాటల కోసం రేడియో ఉన్నవాళ్ళింట్లో కూర్చొని ఓపికగా వినేవాళ్ళం మనసు ప్రశాంతంగా ఉండేది.
మా ఇంట్లో కూడా రేడియో ఉంటె బాగుండు అనే ఆశ ఉండేది ..
ఇంటికి చుట్టాలొచ్చి వెళ్తో వెళ్తూ చేతిలో రూపాయో అర్ధరూపాయో పెడితే ఎంత ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే దుఃఖం తన్నుకు వచ్చేది..ఇంకా ఉంటే బాగుండు అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో.. ఇప్పుడు ఆనందం ఏమో గాని ఎప్పుడు పోతారా అన్నట్లుగా చూస్తున్నారు.
కోకాకోలా మూతలను రెండు రంద్రాలు చేసి బస్తా దారంతో ముఠాకు కట్టి గిరా గిర తిప్పుతూ ఎంతో ఆనందించేవాళ్ళము.
జాతరలో కొన్న బొమ్మలను చూసుకొని మురిసే ఆనందం
కోట్లు పెట్టిన కొనలేని ఆనందం.
అన్నంలో చింత చిగురు ఒట్టి చాపల కూర ఏమి రుచి...ఏమి ఆనందం కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయేవాళ్ళం.. ఈరోజుల్లో ఆ చింతచెట్లు అంతరించాయి.. ఆ కూరని మరిచారు ...
కాలక్షేపానికి లోటే లేదు. స్నేహితులు కబుర్లు, ఆటలు, ఈతకు పోయేవాళ్ళం ఆ ఆనందం వేరు సర్కస్ లు, దాగుడు మూతలు. చింత పిక్కలు, ముక్కు గిచ్చుడు, పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు.. ఎన్ని ఆటలో..
వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ నెంబర్ : 9391480475
జీవితం ఆశ-నిరాశల సంగమం:
జీవితం ఆశ-నిరాశల సంగమం: ఒక్కోసారి ఉన్నట్లుండి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది జీవితం, ఊపిరినే ఉరితాడుగా మార్చేస్తుంది నిరాశల నిశ్శబ్దం. కన్నీటి ...
-
మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన వృత్తి 'కుమ్మరి వృత్తి'. మట్టితో మహత్తర ప్రయోగాలు చేసి మట్టి పాత్రలకు జీవం ప...
-
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏసుక్రీస్తు జ...
-
మా ఊరి జ్ఞాపకాలు: మా ఊరు గుమ్మడవెల్లి. ఊరు చుట్టూ చూడచక్కని పచ్చని పంటపొలాలు. ఊరినడుమ ఊట బావులు, ఊరి చివరన చెలిమ భావి. ఊరి నట్టనడుమ రాములవార...










.jpg)




